Bhupalapally district: కన్ను మిన్ను కానక ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను, కడుపార కన్నకూతురును హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించేందుకు కుట్ర చేసి జైలుపాలు అయిన కిల్లర్ కిలాడి ఉదంతం ఇది.. కామంతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న భర్తను, కన్నకూతురును కడతేర్చిన దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Bhupalapally District) చిట్యాల మండలం వడితల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కవిత(Kavitha) అనే మహిళ భర్త పక్షవాతంతో బాధపడుతుండగా, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమే వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి పక్షవాతం వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. వివాహేతర సంబంధం విషయం కూతురివర్షిణి(22) కి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి కూతురును హత్యకు పాల్పడింది.
Also Read: Telangana Govt: సీబీఐ విచారణపై జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక వేటు తప్పదా..?
క్షుద్ర పూజలుగా చిత్రీకరించే ప్రయత్నం
కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి(Bhupalapally) – కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించే ప్రయత్నం చేసింది తల్లి కవిత. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు కిలాడి ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కిల్లర్ లేడీ మరో హత్య కోసం కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. విచారణ తేలిన నిజాల ఆధారంగా ప్రియుడిని, కవితను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Dondigal Lake Accident: గణేష్ నిమజ్జనోత్సవంలో విషాదం.. ఆటో చెరువులో పడి తండ్రి, కొడుకు?
హత్య కేసును చేదించిన కాటారం పోలీసులు
తేదీ 25/08/2025 రోజున కాటారం పోలీస్ స్టేషన్లో నమోదు అయినటువంటి కప్పల వర్షిని హత్య కేసు కు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్ గారు ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించడం జరిగినది జిల్లా ఎస్పీ గారి కథనం మేరకు తేదీ 28/08/ 2025 రోజున కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో కమలాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఒక గుర్తుతెలియని అమ్మాయి మృతదేహం నేషనల్ హైవే పక్కన పడి ఉన్నది మరియు శవానికి చుట్టుపక్కల క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని సమాచారం.
06/08/2025 రోజున ఫిర్యాదు
రాగా కాటారం ఎస్సై ఆకుల శ్రీనివాస్ మరియు కాటారం సిఐ నాగార్జున రావు మరియు కాటారం డిఎస్పి సూర్యనారాయణ గార్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా ఆట్టి చనిపోయిన అమ్మాయి కప్పల వర్షిని తండ్రి కుమారస్వామి వయస్సు 22 సంవత్సరాలు కులం బెస్త నివాసం ఒడితల గ్రామం చిట్యాల మండలం అని ఇట్టి అమ్మాయి తేదీ 03/08 2025 నుండి కనిపించడం లేదని వర్షిని తల్లి అయిన కప్పల కవిత భర్త లేట్ కుమారస్వామి వారి స్థానిక పోలీస్ స్టేషన్ అయిన చిట్యాలలో 06/08/2025 రోజున ఫిర్యాదు చేసినట్లుగా అప్పటి నుండి తన కూతురు గురించి తాను మరియు వారి కుటుంబ సభ్యులు మరియు పోలీసు వారు ఆచూకీ కోసం గాలిస్తున్నారని తెలిపి నా కూతుర్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల కోసం చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదు పై హత్య కేసు నమోదు చేసిన కాటారం పోలీసు వారు కాటారం డిఎస్పి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో సిఐ నాగార్జున రావు విచారణ చేపట్టడం జరిగింది.
విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
కాగా తేదీ 02/09/ 2025 రోజున కాటారం సిఐ నాగార్జున రావు గారు తన సిబ్బందితో గంగారం క్రాస్ రోడ్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పైన మృతురాలి తల్లి అయిన కప్పల కవిత మరియు మరొక వ్యక్తితో కొయ్యూరు నుండి కాటారం వైపుగా వస్తుండగా పోలీసు వారిని చూసి తమ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసు వారు వెంబడించి పట్టుకొని విచారించగా వారు నేరమును అంగీకరించినారు పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి తండ్రి సమ్మయ్య వయసు 50 సంవత్సరాలు వృత్తి వ్యవసాయం నివాసం ఒడితల గ్రామం చిట్యాల మండలం అను వ్యక్తికి తన మొదటి భార్య చనిపోగా గత 24 సంవత్సరముల క్రితం కొయ్యూరు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన మాదరవేణి కవిత ను రెండో వివాహం చేసుకోగా వీరి ఇరువురికి ఇద్దరు ఆడసంతానం వారిలో పెద్ద అమ్మాయి కప్పల వర్షిని వయసు 22 సంవత్సరాలు చిన్న అమ్మాయి కప్పల హన్సిక వయసు 21 సంవత్సరములు కాగా చిన్న అమ్మాయికి వివాహమై ఇంటి నుండి వెళ్లిపోగా ఓడతల గ్రామంలో పెద్దమ్మాయి వర్షిని తోపాటు భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.
Also Read: Crime News: పిల్లలను కిడ్నాప్ చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. ఎక్కడంటే..?
జంజర్ల రాజ్ కుమార్‌తో అక్రమ సంబంధం
కాగా గత ఐదు సంవత్సరముల క్రితం కవిత భర్తకు పక్షవాతం వచ్చి ఇంటికి పరిమితం అవడం జరిగినది కాగా కప్పల కవితకు తన గ్రామానికి చెందిన అవివాహితుడైన జంజర్ల రాజ్ కుమార్ తండ్రి మారయ్య వయసు 24 సంవత్సరాలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అట్టి పరిచయం అక్రమ సంబంధం గా మార్పు చెంది గత మూడు సంవత్సరముల నుండి వీరు ఇరువురు తరచూ కలుసుకునేవారు ఇట్టి విషయం కొన్ని నెలల క్రితం కప్పల కవిత భర్త ఆయన కుమారస్వామికి తెలియడంతో కుటుంబంలో తరచూ తగాదాలు జరుగుచున్నవి కాగా రాజ్ కుమార్ కవితలు ఇరువురు కలుసుకునుటకు భర్త అడ్డం వస్తున్నాడని ఆట్టి అడ్డును తొలగించాలని తేదీ 25/06/ 2025 రోజున తన కూతురు ఇంట్లో లేని సమయంలో మధ్యాహ్నం 1:00 సమయంలో పక్షవాతం వచ్చి తన ఇంట్లో మంచం పై పడుకొని ఉన్న భర్తను కవిత కదలకుండా కాళ్లు పట్టుకోగా రాజ్ కుమార్ నోరు మూసి గొంతు నొలిమి హత్య చేసి అక్కడి నుండి వెళ్లిపోగా భార్య కవిత తన భర్త అనారోగ్య కారణంతో చనిపోయాడని ఊరివారిని బంధువులని అందరినీ నమ్మించి అంత్యక్రియలు జరిపించింది.
అక్రమ సంబంధానికి ఎటువంటి అడ్డంకులు
తర్వాత కొన్ని రోజులకు ఇట్టి విషయమై తన పెద్ద కూతురైన వర్షిని తరచూ తన తల్లిని నిలదీయడం మరియు తన తల్లిని కలవడానికి తరచూ వస్తున్న రాజ్ కుమార్ ని అడ్డుకోవడం వంటివి చేయడంతో ఉన్న ఈ ఒక్క అమ్మాయిని అడ్డు తొలగిస్తే మన అక్రమ సంబంధానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు అని రాజ్ కుమార్ తెలుపగా దానికి అంగీకరించిన కవిత ఇద్దరు కలిసి ముందస్తు పన్నాగంతో తేదీ 02/08/ 2025 రోజు అర్ధరాత్రి అనగా తెల్లవారితే 03/08/2025 ఉదయం రెండు గంటల సమయంలో ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న తన కూతురు వర్షిని ని తన భర్తను చంపిన విధంగానే ఇరువురు కలిసి హత్య చేసి మృతురాలని తన ఇంట్లో ఉన్న సంచిలో మూటకట్టి అట్టి మూటకు తన ఇంట్లో ఉన్న దండం వైరుని తెంచి కట్టి వారి ఇంటి వెనకాల ఉన్న చెట్ల పొదలలో దాచిపెట్టి అదే రోజు రాత్రి సమయంలో అట్టి మూటను అక్కడి నుండి ఒడిదల గ్రామ శివారులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల ఉన్న దుబ్బగట్టుగుట్ట చెట్ల పొదలలో పడవేసినారు.
శవం చుట్టూ ఇనుప మేకులు కొట్టి క్షుద్ర పూజలు
అనేది తెలుసుకొని శవం పైన పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు ఉంచి శవం చుట్టూ ఇనుప మేకులు కొట్టి క్షుద్ర పూజలు చేసి చంపినట్లుగా చిత్రీకరించి అక్కడ నుండి ఒడితల గ్రామానికి వెళ్లిపోయి ఎవరికి ఏమీ తెలియనట్లుగా ఎవరింట్లో వారు ఉండగా కప్పల కవిత తన భర్తను మరియు కూతుర్ని చంపిన విషయం ఎప్పటికైనా బయటకి వస్తుందన్న భయంతో రాజ్ కుమార్ తో కలిసి గ్రామం నుండి వెళ్లిపోయి మహారాష్ట్రలో ఏదో ఒక పని చేసుకుంటూ ఇద్దరం కలిసి జీవిద్దాం అనే ఆలోచనతో ఈరోజు రాజ్ కుమార్ తో పాటు ఎక్సెల్ బండి పైన ఒడితల గ్రామం నుండి బస్వాపూర్ రోడ్డు మీదుగా కొయ్యూరు నుండి గంగారం క్రాస్ మీదుగా మహారాష్ట్ర వెళ్లే ఉద్దేశంతో వస్తూ ఉండగా పోలీసు వారు వారిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగినది. ఈ సందర్భంగా ఇట్టి హత్య కేసులను చాకచక్యంగా చేదించిన డి.ఎస్.పి కాటారం సూర్యనారాయణ విచారణ అధికారి సిఐ నాగార్జున రావు మరియు కాటారం ఎస్సై శ్రీనివాస్ గారిని మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
Also Read:Crime News: భార్య, అత్తను చంపేసిన వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!