Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: పిల్లలను కిడ్నాప్​ చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్​.. ఎక్కడంటే..?

Crime News: అయిదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ అమ్ముకుంటున్న గ్యాంగ్ ను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా బారిన పడ్డ ఆరుగురు పిల్లలను రక్షించారు. నిందితుల నుంచి 5లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్​ జోన్ డీసీపీ డాక్టర్ వినీత్(DCP Veeneth), మియాపూర్​ ఏసీపీ శ్రీనివాస్(ACP Srinivass) తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లింగంపల్లి పోచమ్మ ఆలయం ప్రాంతంలో గుడిసెలో నివాసముంటున్న ఓ మహిళ గతనెల 26న తాను ఆస్పత్రికి వెళ్లినపుడు నాలుగేళ్ల తన కుమారుడు అఖిల్ కనిపించకుండా పోయినట్టు చందానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిసర ప్రాంతాలు మొత్తం గాలించినా అఖిల్ జాడ తెలియలేదని పేర్కొంది.

ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పోచమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. వాటిని విశ్లేషించగా అఖిల్ ను ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టుగా తేలింది. దాంతో అధికారులు అఖిల్ ను తీసుకెళ్లిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పక్కగా ఆధారాలు సేకరించిన ఈ ప్రత్యేక బృందం గ్యాంగ్ లీడర్​ గా ఉన్న చిలుకూరి రాజు(Raju)తో పాటు మహ్మద్ ఆసిఫ్​, రిజ్వానా, నర్సింహా రెడ్డి, బాలరాజును అరెస్ట్ చేసింది.

Also Read: Samantha: ఒక రోజు నాగ చైతన్యతో అలాంటి పని చేశా.. సమంత సంచలన కామెంట్స్

అయిదేళ్లుగా..

ఆయుర్వేద ముందుల స్టోర్ నడుపుతున్న పటాన్​ చెరు జేపీ కాలనీ నివాసి చిలుకూరి రాజు తన సహచరులతో కలిసి అయిదేళ్లుగా చిన్నారులను కిడ్నాప్ చేసి సంతానం లేని వారికి అమ్ముకుంటున్నట్టుగా విచారణలో తేలింది. రైల్వే స్టేషన్లు.. జన సంచారం పెద్దగా ఉండని ప్రాంతాల్లో తిరుగుతూ ఈ ముఠా అయిదేళ్ల లోపు వయసున్న పిల్లలను టార్గెట్ గా చేసేవారని వెల్లడైంది. పక్కాగా రెక్కీ జరిపి పిల్లలను కిడ్నాప్​ చేస్తూ వస్తున్నారని స్పష్టమైంది. నాలుగేళ్ల క్రితం చిలుకూరి రాజు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నుంచి ఓ బాలికను కిడ్నాప్​ చేసి 42వేల రూపాయలకు అమ్ముకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.

ఆ తరువాత సైబరాబాద్​, హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్లతోపాటు సంగారెడ్డిలో చిన్న పిల్లలను కిడ్నాప్​ చేసి విక్రయించినట్టుగా తేలింది. చిలుకూరి రాజు, నర్సింహారెడ్డి లు కలిసి పిల్లలను కిడ్నాప్ చేస్తే మహ్మద్​ ఆసిఫ్​, రిజ్వానాలు ఆ చిన్నారులను సంతానం లేని తల్లిదండ్రులకు అమ్ముతూ వచ్చారని నిర్ధారణ అయ్యింది. వచ్చిన డబ్బును అంతా కలిసి పంచుకునే వారని తేలింది. ఇక, పటాన్​ చెరు ప్రాంతంలో ఉంటున్న భార్యాభర్తలు డబ్బు అవసరమై తమ మూడు రోజులు, ఒక రోజు వయసున్న పిల్లలను మహ్మద్​ ఆసిఫ్​ ద్వారా సంతానం లేని వారికి అమ్మినట్టుగా వెల్లడైంది.

ఆరుగురిని..

చిలుకూరి రాజు గ్యాంగ్​ చేతుల్లో కిడ్నాపై అమ్ముడు పోయిన అఖిల్ (5), అరుణ్​ (2), అమ్ములు (8నెలలు‌‌), లాస్య (5), అద్విక్​ (2), ప్రియ (1)ను పోలీసులు రక్షించారు. వీరిని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్​ ఆఫీసర్ కు అప్పగించారు. పకడ్భంధీగా విచారణ జరిపి చిన్న పిల్లల కిడ్నాప్​ గ్యాంగ్​ ను పట్టుకున్న సిబ్బందిని డీసీపీ వినీత్ అభినందించారు.

Also Read: Crime News: గంజాయి దందా చేస్తూ పట్టుబడ్డ సెక్యూరిటీ గార్డు.. ఎక్కడంటే..?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం