Electricity Department: గ్రేటర్ హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో విద్యుత్ శాఖ నిమగ్నమైంది. శోభాయాత్ర, నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్((Hyderabada) పరిధిలో ఈనెల 6వ తేదీన గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాగా విద్యుత్ భద్రతా పరంగా సురక్షితంగా, సజావుగా యాత్ర జరిగేందుకు కావాల్సిన చర్యలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చేపడుతోంది. పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన మండపాలను, ఆ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే వీధులను, రహదారులను అధికారులు ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్ క్రాసింగ్లు, వదులుగా ఉన్న తీగలు సరి చేయటం, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవరమైన చోట ఇన్సులేషన్ ఏర్పాటు, ఇనుప స్తంభాలు, ఫ్యూజ్ బాక్సులు ఉన్నచోట పీవీసీ పైపులు, ప్లాస్టిక్ షీట్ల ఏర్పాటు చేయడం వంటి పనులు పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా
గణేషుడి శోభాయాత్ర, నిమన్జనంలో శాఖ తరుపున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సిబ్బందిని నిత్యం అందుబాటులో ఉండేలా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ(CMD Musharraf Farooqui) నిర్ణయించారు. అందుకు అనుగుణంగా డ్యూటీ చార్ట్ ను రూపొందించారు. ప్రతి సెక్షన్ పరిధిలో నిరంతరం అందుబాటులో ఉండేలా షిఫ్టులవారీగా సిబ్బందిని నియమించారు. గ్రేటర్ లో వివిధ విభాగాలైన ఆపరేషన్, లైన్స్, సీబీడీలకు చెందిన 101 సబ్ డివిజన్ స్థాయి టీంలకు తోడు ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని కూడా విధులు నిర్వహించేలా ఎస్పీడీసీఎల్(SPDCL) సీఎండీ ఆదేశాలు జారీచేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిర్వహించే నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పర్యవేక్షించడానికి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకునేందుకు సంస్థ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లను ఇన్ చార్జీలుగా నియమించారు.
Also Read: Viral News: హెల్పర్‌కు స్టీరింగ్ అప్పగించి.. కొద్దిసేపటికే డ్రైవర్ మృతి.. ఏం జరిగిందంటే?
రంగారెడ్డి జోన్ పరిధిలో
ఇదిలా ఉండగా నిమజ్జనం నిర్వహించేందుకు ప్రత్యేకంగా 68 కంట్రోల్ రూంలు, 104 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుచేశారు. వాటిలో మేడ్చల్ జోన్ పరిధిలో 71 నిమజ్జన ప్రాంతాల్లో 31 కంట్రోల్ రూమ్స్, 43 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జోన్ పరిధిలో 29 నిమజ్జన ప్రాంతాల్లో 25 కంట్రోల్ రూమ్స్, 22 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మెట్రో జోన్ పరిధిలో 10 నిమజ్జన ప్రాంతాల్లో 12 కంట్రోల్ రూమ్స్, అదనంగా 39 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో, విద్యుత్ అధికారులు పెద్ద విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే మార్గాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సిబ్బందిని ఆదేశించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు నిత్యం అప్రమతంగా ఉండేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటోంది.
Also Read: Hyderabad Schools: హైదరాబాద్ సిటీలో పాఠశాలలకు నయా రూల్.. త్వరలోనే అమల్లోకి!