GHMC
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Hyderabad Schools: హైదరాబాద్‌ సిటీలో పాఠశాలలకు నయా రూల్.. త్వరలోనే అమల్లోకి!

Hyderabad Schools: త్వరలో స్కూళ్లలో ఈట్ రైట్ కార్యక్రమం అమలు

ఏం తినాలి..ఎలా తినాలి అనే దానిపై అవగాహన
ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై సూచనలు
త్వరలో అన్ని స్కూళ్లలో ఈట్ రైట్ ప్రత్యేక కార్యక్రమం
ఆహారంపై విద్యార్థుల్లో అవగాహన కోసం స్టేట్ ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ ఉమ్మడి కార్యక్రమం
ఇప్పటి వరకు 261 స్కూళ్ల నమోదు
స్కూళ్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ త్వరలో జీహెచ్ఎంసీ సర్క్యులర్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు కోటిన్నర జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ తాజాగా మరో బాధ్యతను భుజాన వేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని స్కూళ్లలోని (Hyderabad Schools) విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, ఎలా తినాలి అన్న విషయంపై అవగాహన పెంచేందుకు త్వరలోనే స్టేట్ ఫుడ్ సేఫ్టీ వింగ్‌తో కలిసి ఈట్ రైట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా చాలా ప్రాంతాల్లోని విద్యార్థులుచ తమ స్కూల్ కు సమీపంలో విక్రయించే నాణ్యత లేని తినుబండారాలు తీసుకుని, అస్వస్థతకు గురవుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారంపై వారికి విద్యార్థి దశలోనే అవగాహన కల్పిస్తే, వారు జీవితాంతం ఆ మంచి అలవాటును అనుసరించే అవకాశముందన్న విషయాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ ‘ఈట్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రతిపాదనలను సిద్దం చేసింది. జీహెచ్ఎంసీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ మేరకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) రఘుప్రసాద్ శుక్రవారం స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. విద్యార్థి దశలోనే ఆహారం, నాణ్యతతో పాటు ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్న విషయంపై విద్యార్థులను చైతన్యవంతులను చేసే చక్కటి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని హెల్త్ వింగ్‌తో నిర్వహించేందుకు వీలుగా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ ‘ఈట్ రైట్’ కార్యక్రమం నిర్వహణకు ముందు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్కూళ్లన్నీ జీహెచ్ఎంసీలో నమోదు చేసుకోవాలని ఆదేశిస్తూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ త్వరలోనే సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిసింది.

Read Also- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంఛింగ్ డేట్ ఖరారు.. చద‌రంగం కాదు, ర‌ణ‌రంగ‌మే!

ముఖ్యంగా వర్షాకాల సీజన్లో వేడి చేసి, చల్లార్చిన నీళ్లు తాగాలని, వ్యక్తి గత పరిశుభ్రత, నాణ్యమైన వేడివేడి ఆహారం తీసుకోవాలన్న విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ, స్టేట్ ఫుడ్ సేఫ్టీ వింగ్ సిద్ధమవుతున్నాయి. రేపటి పౌరులుగా ఎదగనున్న నేటి విద్యార్థులకు ముఖ్యంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయుత్రం 4 గంటల సమయంలో తీసుకోవాల్సిన ఆహారం వివరాలు, స్నాక్స్‌పై ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వర్షాకాలం, రోజుల తరబడి వర్షం కురుస్తున్న సమయంలో తీసుకోవాల్సిన ఆహారంతో పాటు ఎండాకాలం శరీరం వేడిని తట్టుకునేలా ఉండేలా తీసుకోవాల్సిన ఆహార వివరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిసింది.

Read Also- Nagarjuna: ఇంకా సైమన్ లుక్‌లోనే నాగార్జున.. బర్త్ డే స్పెషల్‌గా ఫ్యాన్స్‌ని మీటైన కింగ్!

ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే స్టేట్ ఫుడ్ సేఫ్టీ వింగ్ సిటీలోని 261 స్కూళ్ల వివరాలను సేకరించినట్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని పక్కాగా, ప్రణాళిక బద్దంగా నిర్వహించేందుకు గాను జీహెచ్ఎంసీని భాగస్వామిని చేయాలని ఫుడ్ సేఫ్టీ వింగ్ భావిస్తున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని మొత్తం 800 పై చిలుకు స్కూల్స్ ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలతో పాటు మేడ్చల్ మల్కాజ్ గిరి, కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని స్కూళ్లన్నింటి వివరాలు సేకరించి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలా? లేక ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన 261 స్కూళ్లలో ఈట్ రైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే, మిగిలిన పాఠశాల రిజిస్టేషన్, ఈట్ రైట్ కార్యక్రమాన్ని నిర్వహించాలా? అన్న విషయంపై మరింత క్లారిటీ రావల్సి ఉంది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?