Viral News: ఎవరి ప్రాణాలు ఎప్పుడు, ఏవిధంగా పోతాయో చెప్పలేం. ముఖ్యంగా ప్రాణాలను రిస్క్‌లో పెట్టి కడుపు నింపుకునే డ్రైవర్ల స్థితి మరీ దయనీయం. గంటల తరబడి స్టీరింగ్ పట్టుకుని, నిద్ర లేకుండా డ్యూటీ చేస్తుంటారు. వందలాది ప్రాణాల భద్రతను భుజాన వేసుకుని బాధ్యతగా నడుచుకుంటుంటారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఎందరో డ్రైవర్లు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న (Viral News) విషయం అందరికీ తెలిసిందే. రాజస్థాన్‌లో ఓ బస్సు డ్రైవర్ డ్యూటీలో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. అతడు నడిపిన బస్సుకు ఎలాంటి ప్రమాదమూ జరగకపోయినా, గుండెపోటు అతడిని కబళించివేసింది. మృతి చెందిన ఆ వ్యక్తి పేరు సతీష్ రావు.
అయితే, గుండెపోటుతో చనిపోవడానికి గంట ముందే సతీష్ రావు బస్సు డ్రైవింగ్ బాధ్యతను సహచరుడికి(హెల్పర్) అప్పగించాడు. స్టీరింగ్‌ను అతడికి అప్పగించి కొద్దిసేప పక్కనే కూర్చున్నాడు. తీవ్ర గుండెపోటుకు గురికావడంతో అతడు కూర్చున్నచోటనే కూలబడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి అనుకొని పడిపోయాడు. పైకి లేపి కూర్చొబెట్టి.. దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే, సతీష్ రావు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
Read Also- Viral News: ఆన్లైన్ పేమెంట్ తో భర్త గుట్టు మొత్తం బయటకు.. ఉన్న పెళ్లాం పోయే, ఉంచుకున్న సెటప్ పోయే?
కాగా, సతీష్‌కు గుండెపోటు వచ్చి పడిపోవడం బస్సులో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయింది. డ్రైవింగ్ స్టీరింగ్‌ను డ్రైవర్‌కి అప్పగించి, సడెన్‌గా పడిపోయిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. బస్సు ముందు సీట్లో కూర్చున్న ఓ మహిళ సాయం చేయాలంటూ బిగ్గరగా చెప్పడంతో, బస్సులో ఓ ప్రయాణికుడు వెంటనే స్పందించాడు. నిలబెట్టే ప్రయత్నం చేశాడు. పాదాలు, అరచేతులను రుద్దుతూ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం రాజస్థాన్‌లోని కేల్వా రాజ్‌నగర్‌కు సమీపంలో జరిగింది. కాగా, వందలమంది ప్రయాణికుల ప్రయాణాలను జాగ్రత్తగా కాపాడుతూ గమ్యస్థానాలకు చేర్చే డ్రైవర్ల త్యాగాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ విషాద ఘటనలో సతీష్ రావు చివరి క్షణాల్లో కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. బస్సులోని ప్రతి ప్రయాణికుని ప్రాణం కాపాడేందుకు ప్రయత్నం చేశారు.
Read Also- Mowgli Glimpse: పాతికేళ్లు కూడా నిండని కుర్రాడు ప్రేమ కోసం ఏం చేశాడంటే?
సతీష్ రావు గనుక తక్షణమే స్టీరింగ్‌ను తన హెల్పర్‌కి అప్పగించి ఉండకపోతే పెనుప్రమాదానికి దారితీసి ఉండేది. ఎక్కువ దూరం ప్రయాణించే రూట్లలో అనుసరించాల్సిన రూల్స్ ప్రకారం, బస్సులో ఉన్న రెండో డ్రైవర్ వెంటనే స్టీరింగ్‌ను అందుకున్నాడు. నిజానికి, స్టీరింగ్ అందుకున్న రెండవ డ్రైవర్.. బాధిత సతీష్ రావు కోసం మెడిసిన్ కొనేందుకు ప్రయత్నించాడు. మార్గంలో ఉన్న గోమతి చౌరాహా వద్ద మెడికల్ షాపుల కోసం వెతికాడు. కానీ, అక్కడ అన్ని మెడికల్ షాపులు మూసివేసి ఉండటంతో మందులు కొనలేకపోయాడు. గోమతి చౌరాహా నుంచి బస్సు బయలుదేరిన కొద్ది సేపటికే, డెసూరి నాల్ ఘాట్ సమీపంలో సతీష్ రావు ఆరోగ్యం మరింత విషమించింది. కుప్పకూలిన వెంటనే, అదే మార్గంలో ఉన్న డెసూరి ప్రభుత్వ ఆసుపత్రికి బస్సును తీసుకెళ్లాడు. కానీ, సతీష్ రావు అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు.