Bhupalapally Shocking: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కాటారం మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో యువతి మృతదేహాం లభ్యమైంది. అది కూడా కుళ్లిన స్థితిలో ఉండటం చూసి స్థానికులు హడలిపోయారు. ఘటన స్థలిలో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి(22)గా పోలీసులు గుర్తించారు.
ఈ నెల 6న మిస్సైన యువతి
ఈ నెల 5 నుంచి యువతి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 6 న చిట్యాల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు కూడా చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అటవీ ప్రాంతంలో కుళ్ళిపోయిన యువతి దేహం ఉన్నట్టు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు.. చనిపోయిన యువతి వర్షిణీగా గుర్తించారు. అయితే మృతదేహాం వద్ద పసుపు, కుంకుమ నిమ్మకాయల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో క్షుద్రపూజలు చేసి యువతిని బలిచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read: AI-powered Smartphone Tool: అంధత్వానికి చెక్.. గ్లాకోమాను గుర్తించే.. అద్భుతమైన ఏఐ సాధనం రెడీ!
అఘాయిత్యం జరిగిందా?
అటవీ ప్రాంతంలో నిర్మానుషంగా ఉండే ప్రదేశంలో యువతీ మృతదేహం ఉన్న తీరు, చుట్టూ పక్కల కనిపించిన పరిస్థితి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అసలేం జరిగింది? యువతి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా తీసుకువచ్చి ఏదైనా అఘాయిత్యం చేసి హత్య చేశారా? లేకుంటే క్షుద్ర పూజలు చేసి యువతిని బలి తీసుకున్నారా? అనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలిలో లభించిన క్లూస్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే యువతి మరణానికి గల కారణాలను తెలియజేస్తామని పేర్కొన్నారు.