Satyaraj Intresting Comments On Modi Biopic
Cinema

Satyaraj: ఆ మూవీ చేయాలంటే వన్‌ కండీషన్‌

Satyaraj Intresting Comments On Modi Biopic: కోలీవుడ్ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ భారత ప్రధాని మోడీ బయోపిక్‌లో యాక్ట్ చేస్తున్నట్లు ఇటీవల నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. ఈ బయోపిక్ లో సత్యరాజ్ మోదీ రోల్‌ చేస్తున్నట్టు కోలీవుడ్‌ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే దీనిపై రీసెంట్‌గా సత్యరాజ్ రియాక్ట్ అయ్యారు. ఆ వార్త‌లన్ని అబ‌ద్దమ‌ని తేల్చి చెప్పేశాడు.

అంతేకాకుండా నా ఐడియాలజీ, మోడీ ఐడియాలజీ వేరని.. ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌ను ఆరాధించే నేను మోదీ బయోపిక్‌లో న‌టిస్తార‌ని ఎలా అనుకున్నారంటూ స‌త్య‌రాజ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లయింది. ఆ సీన్ కట్ చేస్తే తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సత్యరాజ్ తాను మోడీ బయోపిక్‌లో యాక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు అందరికి ఊహించని షాక్ ఇచ్చాడు. కాకపోతే దీనికి ఓ కండీషన్ కూడా పెట్టాడు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన మలై పిడిక్కత మనితాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సత్యరాజ్ మోడీ బయోపిక్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

Also Read: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో భామ

మోదీ పాత్రలో నటించడానికి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నిజాన్ని నిజాయితీగా చూపించే నా మిత్రుడు దివంగత దర్శకుడు మణివణ్ణన్ మోడీ బయోపిక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ట్లయితే నేను ఈ మూవీలో న‌టించి ఉండ‌వ‌చ్చు. ఇప్పుడు అత‌ను లేడు కాబ‌ట్టి వెట్రి మారన్ కానీ లేదా పా.రజిత్ కానీ మరి సెల్వరాజ్ లాంటి ద‌ర్శ‌కులు ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తే తప్పకుండా ఇందులో న‌టిస్తా అంటూ ఈ వార్తలపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఇంకేముంది సత్యారాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాని షేక్ చేస్తున్నాయి.

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?