UP Man: ఉత్తర్ ప్రదేశ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భార్య చెల్లితో పెళ్లి చేయాలని పట్టుబట్టిన భర్త.. విద్యుత్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. భార్య తన డిమాండ్ కు ఒప్పుకోవాలని.. లేదంటే టవర్ పై నుంచి దూకి చనిపోతానని బెదరించాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని కన్నౌజ్ జిల్లాకు చెందిన రాజ్ సక్సేనా (Raj Saxena)కు 2021లోనే మొదటి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి అయిన ఏడాది తర్వాత భార్య అనారోగ్యంతో మరణించింది. దీంతో ఆమె చెల్లిని రాజ్ పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఇటీవల భార్య చెల్లెలిపై కన్నేసిన రాజ్.. ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని భావించాడు.
Also Read: Wagah-Attari Border: పాక్ దౌర్భాగ్యం చూశారా.. ప్రకృతి కూడా ఆటపట్టిస్తోంది.. వైరల్ వీడియో
టవర్ ఎక్కి.. పెద్దగా అరుస్తూ
గురువారం (ఆగస్టు 28) ఉదయం తన కోరికను భార్యకు చెప్పగా ఆమె నిరాకరించింది. ఆపై తీవ్రంగా మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ సక్సేనా.. ఇంటి దగ్గరలోని హైఓల్టేజ్ విద్యుత్ టవర్ ఎక్కాడు. అక్కడి నుండి పెద్దగా అరుస్తూ భార్య చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేశాడు. చుట్టుపక్కల వారు ఇదంతా చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు.
Also Read: BSNL UPI Services: గూగుల్ పే, ఫోన్ పే.. కొంపముంచబోతున్న బీఎస్ఎన్ఎల్.. టైమ్ కూడా ఫిక్స్!
రంగంలోకి పోలీసులు..
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటీనా విద్యుత్ టవర్ వద్దకు చేరుకున్నారు. టవర్ పై నిలబడి ఉన్న రాజ్ కు నచ్చజెప్పేందుకు యత్నించారు. అటు కుటుంబ సభ్యులు సైతం రాజ్ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అతడు కిందికి వచ్చాడు.
Also Read: Class 9 Girl: టాయిలెట్ అని వెళ్లి.. స్కూల్ బాత్రూమ్‌లో.. బిడ్డను కన్న 9వ తరగతి బాలిక
ఇలాంటిదే మరో ఘటన
యూపీలో ఇలాంటి ఘటనే ఈ నెల ప్రారంభంలో జరిగింది. భదోహి జిల్లాలో ఆగస్టు 4న ఓ వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. పవన్ పాండే.. ఉదయం 9 గం.ల ప్రాంతంలో యాకూబ్ పూర్ వద్ద ఉన్న మెుబైల్ టవర్ ఎక్కాడు. తన ప్రేమించిన ఖుష్బూ అనే అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేశాడు. లేదంటే నేను దూకి చనిపోతానని వార్నింగ్ ఇచ్చాడు. 5 గం.ల పాటు హైడ్రామా జరగ్గా చివరికీ పోలీసులు అతడ్ని కిందకి దింపారు.