Wagah-Attari Border (image Source: Twitter)
Viral

Wagah-Attari Border: పాక్ దౌర్భాగ్యం చూశారా.. ప్రకృతి కూడా ఆటపట్టిస్తోంది.. వైరల్ వీడియో

Wagah-Attari Border: దయాది దేశం పాకిస్థాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ – పాక్ సరిహద్దుల్లోని వాఘా-అట్టారి వద్ద తీసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అందులో భారత్ వైపు భూభాగం చాలా పరిశుభ్రంగా, అభివృద్ధికి కేరాఫ్ గా ఉంటే.. పాక్ సైడ్ మాత్రం వరద నీటిలో నిండి అధ్వాన్నంగా కనిపించింది. ఈ వీడియోను వైరల్ చేస్తూ నెటిజన్లు పాక్ కు తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు.

వీడియోలో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోలో ఇరుదేశాల సైన్యం డ్రిల్ చేస్తూ కనిపించింది. పాక్ రేంజర్లు మడమ లోతు నీటిలో కవాతు చేస్తూ కనిపించారు. అంతేకాదు వరద నీటిని నియంత్రించడానికి ఇసుక సంచులు, ఇటుకల గుట్టలు కూడా పాక్ సైడ్  కనిపించాయి. అయితే భారత్ వైపు మాత్రం గేటు దగ్గర చిన్న నీటి గుంత తప్పించి మిగతా ప్రదేశాలు పొడిగా కనిపించాయి. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఏ సమయంలో చిత్రీకరించారో క్లారిటీ లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

బీఎస్ఎఫ్ జవాన్ ఏమన్నారంటే?
వైరల్ అవుతున్న వీడియోపై పంజాబ్ బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్ అతుల్ పుల్జెలే స్పందించారు. ‘గత కొన్ని రోజులుగా అట్టారి, హుస్సైనివాలా, సద్కి ప్రాంతాల్లో ఎక్కడా నీటి నిల్వ లేదని స్పష్టం చేశారు. అయితే ఆగస్టు 8-9 తేదీల్లో సరిహద్దు ప్రాంతంలో భారీ వర్షం కురిసిందని చెప్పారు. ఆ వీడియో అప్పుడు చిత్రీకరించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

నెటిజన్ల రియాక్షన్..
భారత్ – పాక్ స్థితి గతులను తెలియజేస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇటీవల భారత్ ను మెర్సిడెస్ బెంజ్ తో, తమ దేశాన్ని ట్రక్కుతో పోల్చుకున్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. ‘ఒక వైపు మెరిసే మెర్సిడెస్.. మరో వైపు డంప్ ట్రక్ స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఓ నెటిజన్ అన్నారు. మరో యూజర్ స్పందిస్తూ ‘ఒక వైపు మెరిసే మెర్సిడెస్.. మరో వైపు డంప్ ట్రక్.. ప్రకృతి కూడా పాకిస్థాన్‌ను ఆటపట్టిస్తోంది’ అని రాశారు.

పాక్ ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే?
ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ఓ ప్రైవేట్ డిన్నర్‌లో మునీర్ మాట్లాడుతూ ‘ఒక క్రూడ్ అనాలజీ ఇస్తాను. భారత్ ఒక మెరిసే మెర్సిడెస్‌ అయితే పాకిస్థాన్ రాళ్లతో నిండిన డంప్ ట్రక్. ఈ ట్రక్ కారును ఢీకొంటే నష్టపోయేది ఎవరు?’ అని వ్యాఖ్యానించారు.

Also Read: BSNL UPI Services: గూగుల్ పే, ఫోన్ పే.. కొంపముంచబోతున్న బీఎస్ఎన్ఎల్.. టైమ్ కూడా ఫిక్స్!

పాకిస్థాన్ వరదలు
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తో పాటు జమ్ముకశ్మీర్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ నుంచి పాక్ లోకి ప్రవహించే రావి, సట్లేజ్, చీనాబ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు సింధు నదిపై ఉన్న ఆనకట్టలను ఎత్తనున్నట్లు భారత్ ప్రకటించిన నేపథ్యంలో.. పాకిస్థాన్ తన నది తీర ప్రాంతాల నుండి దాదాపు లక్షన్నర మంది ప్రజలను తరలించింది. అకస్మిక వరదల కారణంగా పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

Also Read: Class 9 Girl: టాయిలెట్ అని వెళ్లి.. స్కూల్ బాత్రూమ్‌లో.. బిడ్డను కన్న 9వ తరగతి బాలిక

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు