BSNL UPI Services (Image Source: twitter)
బిజినెస్

BSNL UPI Services: గూగుల్ పే, ఫోన్ పే.. కొంపముంచబోతున్న బీఎస్ఎన్ఎల్.. టైమ్ కూడా ఫిక్స్!

BSNL UPI Services: ప్రభుత్వ రంగం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి భారీ అప్ డేట్ వచ్చింది. గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (Phone Pay), పేటీఎం (Paytm) తరహాలోనే త్వరలోనే డిజిటల్ యూపీఐ పేమెంట్స్ (UPI Payments) రంగంలోకి బీఎస్ఎన్ఎల్ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన ‘సెల్ఫ్ కేర్ యాప్’ లో బీఎస్ఎన్ఎల్ ప్రకటనలు సైతం ఇస్తుండటం గమనార్హం. ఆ ప్రకటనలు బట్టి బీఎస్ఎన్ఎల్ పే (BSNL Pay) పేరుతో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అదే జరిగితే ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం వంటి సంస్థలకు ఇది బ్యాడ్ న్యూసేనని చెప్పవచ్చు.

ఎప్పుడు ప్రారంభమవుతుంది?
బీఎస్ఎన్ఎల్ పే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై ఈ ప్రభుత్వం రంగ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం దీపావళి (Diwali 2025) నాటికి ఈ కొత్త యూపీఐ సేవ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. కాకపోతే ఇది ప్రత్యేకమైన యాప్ గా అందుబాటులోకి రావడం లేదు. కేవలం బీఎస్ఎస్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లో ఒక పేమెంట్ ఫీచర్ గా మాత్రమే అందుబాటులోకి ఉండనుంది. అది కూడా బీఎస్ఎన్ఎల్ యూజర్లకే ఈ సౌకర్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Class 9 Girl: టాయిలెట్ అని వెళ్లి.. స్కూల్ బాత్రూమ్‌లో.. బిడ్డను కన్న 9వ తరగతి బాలిక

ఎలాంటి సేవలు లభిస్తాయి?
BSNL Pay ప్రారంభమైన తర్వాత యూజర్లు PhonePe, Google Pay, Paytmల మాదిరిగానే అన్ని రకాల ఆన్‌లైన్ పేమెంట్లు చేయగలరు. పేమెంట్ లిమిట్ కూడా వాటి తరహాలోనే ఉండే అవకాశముంది. ఈ సేవ ద్వారా BSNL తన డిజిటల్ ఆఫరింగ్స్ ను విస్తరించి, కస్టమర్లకు సులభమైన పేమెంట్ ఆప్షన్ అందించాలని భావిస్తోంది. సెల్ఫ్ కేర్ యాప్ ను ఉపయోగించి.. బీఎస్ఎన్ఎల్ యూజర్లు మరింత సులభంగా పేమెంట్స్ చేయడానికి వీలు కలుగుతుంది. అదే సమయంలో నానాటికి విస్తరిస్తున్న యూపీఐ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ లో బీఎస్ఎన్ఎల్ కూడా ఒక పోటీదారుగా మారనుంది.

Also Read: Ganesh Mandapams Hyderabad: హైదరాబాద్ టాప్-7 గణేష్ మండపాలు.. ఇప్పుడు మిస్ అయితే.. ఏడాదంతా బాధపడాల్సిందే!

దీపావళికి మరో గుడ్ న్యూస్
ఎయిర్ టెల్, జియో వంటి టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ సైతం 5G సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని నగరాల్లో 5G సిమ్స్ సైతం విక్రయిస్తున్నారు. కానీ ఇప్పటివరకూ 5జీ సేవలు అందుబాటులోకి రాలేదు. అయితే దీపావళి నుంచి తన 5G సేవలను ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎంతో కాలంగా 5జీ కోసం ఎదురుచూస్తున్న బీఎస్ఎన్ఎల్ యూజర్లకు ఇది నిజంగానే శుభవార్తగా చెప్పవచ్చు.

Also Read: BiTV Premium Pack: కేవలం రూ.151తో.. 25 ఓటీటీలు, 450 ఛానళ్లు.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం