Mohammed shami
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Mohammed Shami: రీఎంట్రీ ఎప్పుడని ప్రశ్నిస్తే.. మహ్మద్ షమీ ఆసక్తికర సమాధానం

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) గాయాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులు అవుతోంది. భారత్ తరపున చివరిసారిగా 2025 మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2025లో కూడా ఆడాడు. అయితే, ఇటీవలే ముగిసిన భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ (అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ) టెస్టు సిరీస్‌కి అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు జట్టుని సెలక్ట్ చేయడానికి ముందు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.. షమితో సంప్రదించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. అయితే, తన ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయి నమ్మకం లేదంటూ షమీ స్వయంగా వెనక్కి తగ్గడంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేదంటూ కథనాలు వెలువడ్డాయి.

Read Also- Artificial Beach: హైదరాబాద్‌కు కృత్రిమ సముద్రం.. బీచ్ ఏర్పాటుకు ప్లాన్స్ రెడీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మరి ఇటీవలే ప్రకటించిన ఆసియా కప్ జట్టుని ఎంపిక చేయడానికి ముందు కూడా సెలక్టర్లు సంప్రదించారా? అని ప్రశ్నించగా షమీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సెలెక్టర్లు తనతో కచ్చితంగా మాట్లాడాలని, మాట్లాడకూడదంటూ తాను ఎవర్నీ నిందించబోనని షమీ చెప్పాడు. ‘‘దాని గురించి అంత పెద్దగా పట్టించుకోను. మీ ప్రణాళికలకు నేను ఫిట్ అనుకుంటే జట్టులోకి తీసుకుంటారు. లేకపోతే లేదు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్లు వాళ్ల బాధ్యతలను నెరవేర్చుతారు. దేశానికి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేస్తారు. నేనేం చెబుతానంటే, నాకు అవకాశం ఇస్తే, వందకు వంద శాతం ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను’’ అని షమీ వ్యాఖ్యానించాడు.

Read Also- Naga Chaitanya: నాగ చైతన్య 24వ చిత్రంలో ‘లాపతా లేడీస్’ నటుడు.. ఎవరో తెలుసా?

ఇంగ్లండ్ టూర్‌తో పాటు అంతకుముందు జరిగిన ఆస్ట్రేలియా టూర్‌‌కు ముందు కూడా తాను 100 శాతం ఫిట్‌గా లేనట్టు అనిపించిందని షమీ తెలిపాడు. ‘‘నేను ఒక స్పష్టమైన ఆలోచనను నమ్ముతాను. జట్టు కోరుకునే స్థాయిలో నేను లేనప్పుడు, ఒక అడుగు వెనక్కి తగ్గాలనుకుంటాను’’ అని షమీ స్పష్టంగా చెప్పాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మొత్తంగా ఎంపిక తన చేతులో లేదని, అవకాశం ఇస్తే మాత్రమే కచ్చితంగా తనవంతు కష్టపడతానని షమీ స్పష్టం చేశాడు. గాయాల కారణంగా చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ, తన భవిష్యత్తు, ఎంపికపై తాజాగా స్పందించారు. సెలెక్షన్‌పై తనకేం అభ్యంతరం లేదని, దేశ ప్రయోజనాలే ముందుంటాయని స్పష్టం చేశారు. తిరిగి టీమ్‌లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించగా స్పందించిన షమీ… ‘‘జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు నేను శ్రమిస్తున్నాను. నేను దులీప్ ట్రోఫీలో ఆడగలిగితే, కచ్చితంగా టీ20ల్లో కూడా ఆడగలను. నాకు ఎలాంటి అంచనాలు లేవు. నా సామర్థ్యాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎంపిక మాత్రం నా చేతిలో ఉండదు. అన్ని ఫార్మాట్లలో ఆడడానికి నేను సిద్ధమే. ఒకవేళ దులీప్ ట్రోఫీలో నేను 5 రోజుల మ్యాచు ఆడగలిగితే, అంతర్జాతీయ క్రికెట్ ఆడగలనా లేదా అనే ప్రశ్నే తలెత్తదు’’ అని షమీ పేర్కొన్నాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!