Artificial Beach (Image Source: twitter)
హైదరాబాద్

Artificial Beach: హైదరాబాద్‌కు కృత్రిమ సముద్రం.. బీచ్ ఏర్పాటుకు ప్లాన్స్ రెడీ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Artificial Beach: ప్రపంచంలోని టాప్ నగరాల్లో హైదరాబాద్ కు కచ్చితంగా చోటు ఉంటుంది. మల్టీ నేషనల్ కంపెనీలు, ఖరీదైన హోటల్స్, పార్కులు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, కిడ్స్ ప్లే జోన్, జూ, గోల్కొండ కోట ఇలా చెప్పుకుంటూ పోతే నగర ప్రజల కోసం హైదరాబాద్ లో ఎన్నో ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ హైదరాబాద్ వాసులను ఒక సమస్య మాత్రం చాలాకాలంగా వేధిస్తోంది. వైజాగ్ తరహాలో తమకు సముద్రం ఉండి ఉంటే ఎంతో బాగుంటుందని ప్రజలు ఎంతగానో ఆశ పడుతుంటారు. అయితే అది త్వరలోనే నెరవేరబోతోంది. నగర శివారులో ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రూ.225 కోట్ల వ్యయంతో..
హైదరాబాద్ శివారులోని కొత్వాలగూడలో రూ. 225 కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 35 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానుంది. ఈ మేరకు పర్యాటక రంగానికి తెలంగాణ ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఈ ఆర్టిఫిషియల్ బీచ్ ద్వారా నగరవాసులకు, పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: Teachers Protest: మా సమస్య ప్రభుత్వానికి చెప్పు.. పట్టించుకునేలా చెయ్.. గణపయ్యకు వినతి పత్రం

బీచ్‌లో సకల సౌఖర్యాలు
అంతేకాదు ఈ ఆర్టిఫిషియల్ బీచ్ లో పర్యాటకుల కోసం కళ్లు చెదిరే సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, అత్యాధునిక థియేటర్లు, వివిధ రకాల వంటకాలను అందించే ఫుడ్ కోర్టులు ఇందులో ఉండనున్నాయి. ఈ సౌకర్యాలు బీచ్‌ను ఒక పర్యాటక కేంద్రంగా మార్చడమే కాకుండా నగరానికి ఒక విలాసవంతమైన విడిదిగా కూడా ఉపయోగపడతుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ పర్యాటకానికి ముఖ్య కేంద్రంగా ఇది మారుతుందని అంచనా వేస్తోంది. దీనివల్ల రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని రేవంత్ సర్కార్ అభిప్రాయపడుతోంది.

Also Read: Viral Video: రూ.200 కోట్ల బంగ్లాలో.. వీధి కుక్కకు చోటిచ్చిన షారుక్.. మనసు గెలిచేశాడు భయ్యా!

నగర వాసుల రియాక్షన్
హైదరాబాద్ లో అర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటును నగర వాసులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. పిల్లలకు అదొక మంచి వినోద కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకూ బీచ్ చూడాలని అనిపిస్తే ఏపీలోని బాపట్ల, సూర్యలంక, రామాపురం బీచ్ లకు వెళ్లేవాళ్లమని పలువులు అంటున్నారు. ఈసారి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా వీకెండ్ లో నగరంలోనే బీచ్ ను ఎంజాయ్ చేసే వెసులుబాటు కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ‘బీచ్ కు వెళ్తున్నాం.. వచ్చేవాళ్లు రండి’ అని పిల్లలు అనే రోజులు త్వరలో రాబోతున్నాయని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Viral Video: 10 వేల అడుగుల ఎత్తులో.. డీజే పెట్టుకొని.. యువతి రచ్చ రంబోలా!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!