Viral Video: 10 వేల అడుగుల ఎత్తులో.. డీజే పెట్టి యువతి రచ్చ
Viral Video (Image Source: Insta Video)
Viral News

Viral Video: 10 వేల అడుగుల ఎత్తులో.. డీజే పెట్టుకొని.. యువతి రచ్చ రంబోలా!

Viral Video: ఈ రోజుల్లో డీజేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పండుగలు, పెళ్లిళ్లు, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా ఏ వేడుక జరిగినా డీజే తప్పనిసరిగా మారిపోయింది. బంధువులు, స్నేహితులంతా కలిసి డీజే పాటలకు ధూం ధాం స్టెప్పులు వేయడాన్ని ఇటీవల చూస్తూనే ఉన్నాం. అలాంటి డీజేను ఓ యువతి భూమి నుంచి ఏకంగా 10,000 వేల అడుగుల ఎత్తులో పెట్టి రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే?
భారత్ కు చెందిన ఓ యువతి.. ఆకాశంలో చేసిన డీజే ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. DJ TRYPS పేరుగల ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆమె ఈ వీడియో పోస్ట్ చేసింది. ‘అవును, నేను చేశాను. ఇంకో ప్రత్యేకమైనదానికి సిద్ధంగా ఉండండి’ అంటూ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. వీడియోను పరిశీలిస్తే అందులో పారా గ్లైడింగ్ (Paragliding) చేస్తూ ఓ యువతి లైవ్ సెటప్ లో డీజే వాయించింది. భూమికి 10,000 అడుగుల ఎత్తులో డీజే మ్యూజిక్ (DJ Music) ప్లే చేస్తూ తన చేతులతో స్టెప్పులు వేసింది. ఇలా అంత ఎత్తులో డీజే మెుగించడం చాలా అరుదైన ఘటనగా పలువురు పేర్కొంటున్నారు.

Also Read: Rare Disorder: ఓర్నాయనో.. ఇదేం వింత జబ్బురా అయ్యా.. మనుషుల ముఖాలు దెయ్యాల్లా కనిపిస్తాయట!

నెటిజన్ల రియాక్షన్..
ఆకాశంలో యువతి డీజే వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘వావ్.. రియల్లీ గ్రేట్. ఏమాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా చేశావ్’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘మనకు పారా గ్లైడింగ్ ఫీమేల్ డీజే దొరికింది. నేను వీడియో చూసి నిజంగా షాక్ అయ్యా’ అంటూ ఇంకొకరు రాసుకొచ్చారు. అయితే మరికొందరు యువతి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది పిచ్చి పని, చాలా రిస్కీ’ అని ఒకరు రాయగా.. ’15 సెకన్ల వీడియో కోసం ప్రాణం పణంగా పెట్టడం సరైంది కాదు. దేవుడు నీతో ఉండాలి’ అని మరొకరు స్పందించారు.

 

View this post on Instagram

 

A post shared by TRYPS (@tryps.music)

Also Read: Plants: మనుషులకే కాదు.. మెుక్కలకూ ఆ ఫీలింగ్స్ ఉంటాయట.. అప్పుడవి ఏం చేస్తాయంటే?

పారా గ్లైడింగ్ ప్రమాదం
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ దేశంలో పారా గ్లైడింగ్ కారణంగా అనేక మరణాలు చోటుచేసుకున్నాయి. జూలైలో గుజరాత్ లోని‌ అహ్మదాబాద్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు.. హిమాచల్ ప్రదేశ్‌ ధర్మశాల సమీపంలోని టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో పర్యాటకుడు, పైలట్ ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత పైలట్ ప్రాణాలతో బయటపడినప్పటికీ.. పర్యాటకుడు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also Read: Pushpa 2 Ganesh Mandapam: విచిత్ర మండపం.. పుష్ప 2 స్టైల్లో, బన్నీ విగ్రహంతో.. ఇలా ఉన్నారేంట్రా!

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం