Pushpa 2 Ganesh Mandapam: యావత్ దేశం ఘనంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ వచ్చిందంటే చాలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున గణేష్ మండపాలు వెలుస్తాయి. అయితే ఫ్యాన్స్ తమ హీరోపై అభిమానాన్ని చాటుకునేందుకు గణేష్ మండపాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమిళనాడులో పుష్ప 2 స్టైల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం.. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే?
తమిళనాడులోని హోసూరులో అల్లు అర్జున్ అభిమానులు.. ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. కృత్రిమంగా నిర్మించిన ఎర్ర చందన దుంగలతో మండపం ప్రహారీలు, గోడలను ఏర్పాటు చేశారు. అంతేకాదు గణేష్ విగ్రహాన్ని సైతం పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ గెటప్ లో తీర్చిదిద్దారు. క్లైమాక్స్ లో చీర కట్టుకొని చేతిలో త్రిశూలంతో బన్నీ ఉండే హావభావాలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎంట్రన్స్ లో తమ అభిమాన హీరో బన్నీ విగ్రహాన్ని సైతం ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. దాని వెనక ఒక డమ్మీ హెలికాఫ్టర్ ను సైతం పెట్టారు.
View this post on Instagram
నెటిజన్ల రియాక్షన్
పుష్ప 2 స్టైల్లో నిర్మించిన మండపాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ కు ప్రస్తుతం బాగా నచ్చిన మండపం ఇదేనంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. బన్నీ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులోనూ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది నిదర్శమని అంటున్నారు. ‘మీ అభిమానం సల్లగుండా.. మరి ఇలా ఉన్నారేంట్రా’ అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Also Read: Rare Disorder: ఓర్నాయనో.. ఇదేం వింత జబ్బురా అయ్యా.. మనుషుల ముఖాలు దెయ్యాల్లా కనిపిస్తాయట!
గతంలోనూ అంతే..
అయితే సెలబ్రిటీలు, సినిమాలను అనుకరిస్తూ గణేష్ మండపాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ‘పుష్ప పార్ట్ – 1’ థీమ్ తో దేశవ్యాప్తంగా మండపాలు ఏర్పాటయ్యాయి. అల్లు అర్జున్ (Allu Arjun) వేషధారణతో అప్పట్లో ఏర్పాటు చేసిన విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వీటితో పాటు ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ సినిమాల థీమ్ తో కూడా గతంలో గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు.
Also Read: Rajasthan: 17వ సారి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన.. 55 ఏళ్ల బామ్మ
సీఎం రేవంత్ వేషధారణలో..
తెలంగాణలో ఏర్పాటు చేసిన ఓ వినాయకుడి విగ్రహం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి వేషధారణలో వినూత్నమైన గణనాథుడ్ని ఏర్పాటు చేశారు. ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో అక్కడ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో రూపొందించిన ఈ మండపంలో ప్రతిష్టించిన విగ్రహం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గెటప్ ను పోలి ఉంది. సీఎంను అనుకరిస్తూ విగ్రహం హావభావాలు ఉన్నాయి. దీంతో ఈ విగ్రహాన్ని చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్తున్నారు.
