GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: అధికారులు కుమ్మక్కుతో మరోసారి ఖజానాకు కన్నం..?

GHMC: తక్కువ వ్యయంతో రోడ్ల నిర్వాహణను చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ(GHMC) రెట్టింపు వ్యయానికి మరో 1,142.54 కి.మీల రోడ్ల నిర్వాహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు సిద్దమైంది. అయిదేళ్ల క్రితం అప్పటి గులాబీ సర్కారు నడిచిన బాటలోనే ప్రజాపాలన కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సర్కారు నగరంలోని మెయిన్ రోడ్లకు మెరుగైన నిర్వహణ పేరిట కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం (CRMP) మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా ఆరు జోన్లలోని దాదాపు 1,142.54 కి.మీ ల రోడ్ల నిర్వహణను రూ.3,825 కోట్లకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. కొద్ది నెలల క్రితం స్టాండింగ్ కమిటీ తిరస్కరించిన ఈ ప్రతిపాదన మళ్లీ తెరపైకి రానుంది. ఈ నెల 28న గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుకు మరోసారి సీఆర్ఎంపీ ప్రతిపాదన రానున్నట్లు తెలిసింది. అంటే సగటున కిలో మీటరుకు రూ.3.35 కోట్లు వెచ్చిస్తుంది. ఐదేళ్ల క్రితం గులాబీ పాలన ఉన్నపుడు మొదలైన సీఆర్ఎంపీ-1 ప్రాజెక్ట్ కింద ఈ వ్యయం ఒక్క కిలోమీటరుకు సగటున రూ.2.59 కోట్లు ఉండగా, తాజాగా రూ.3.35 కోట్లకు పెరిగింది. కానీ సీఆర్ఎంపీ-1 కింద నగరంలోని మొత్తం 30 సర్కిళ్లలో సీఆర్ఎంపీ రోడ్ల స్ట్రెచ్ లుగా విభజించి, ఈ రోడ్డు సీఆర్ఎంపీకి చెందినదిగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

సీఆర్ఎంపీ రెండో దశ ప్రాజెక్టు

ఒకరకంగా చెప్పాలంటే ఇదీ సీఆర్ఎంపీ రోడ్డు అన్న బోర్డులు పెట్టడటం వరకే నిర్వహణ పరిమితమైందన్న వాదనలు లేకపొలేవు. నిర్వహణ పరమైన ఫిర్యాదులు, సూచనల కోసం ఫోన్ నెంబర్లను కూడా సూచించారు. కానీ రోడ్ల నిర్వహణకు సంబంధించి సామాన్యులు, కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు, ఇంజనీర్లు ఫోన్లు చేసినా, స్పందన వచ్చేది కాదు. ఈ రకంగా సీఆర్ఎంపీ-1 ప్రాజెక్టులో భాగంగా నిర్వహణ పనుల్లో పారదర్శకత, పనులకు సంబంధించి జవాబుదారి తనం లేని సీఆర్ఎంపీ రెండో దశ ప్రాజెక్టును కొనసాగించేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేయటం, గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదనలను సమర్పించేందుకు సిద్దం కావటం చర్చనీయాంశంగా మారింది. సీఆర్ఎంపీ-2 ప్రాజెక్టుగా సిటీలోని మరో 1142,54 కి.మీ.ల రోడ్ల నిర్వహణను రానున్న అయిదేళ్ల పాటు (2025-2030) ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు, అందుకు రూ. 3825 కోట్లకు మంజూరీ కోరేందుకు యత్నించటం వెనకా అసలు ఆంతర్యమేమిటీ? అన్నది ఇపుడు జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Medchal District: నవరాత్రి వేడుకలపై అప్రమత్తం.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ మను చౌదరి

అగ్రిమెంటు ఏం చెబుతుంది?

అయిదేళ్ల క్రితం అప్పటి గులాబీ సర్కారు రోడ్ల నిర్వహణను ప్రైవేటుపరం చేస్తూ కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం (సీఆర్ఎంపీ) ని తెరపైకి తీసుకువచ్చింది. అప్పట్లో ఏజెన్సీలతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో కిలోమీటరు కొత్త రోడ్డు వేసి, అయిదేళ్ల పాటు దాని నిర్వహణను చేపట్టేందుకు ఒక్కో కిలోమీటరుకు రూ.రెండున్నర కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు కేటాయించారు. ఈ కాంట్రాక్టును పొందిన ఏజెన్సీలు అయిదేళ్ల పాటు ఆ రోడ్డులో స్వీపింగ్ పనులతో పాటు మరమ్మతులు వంటివి చేయాల్సి ఉంది. కానీ ఏజెన్సీలు అగ్రిమెంట్ ప్రకారం పని చేయకపోయినా, చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలమయ్యారు. పైగా కోట్లాది రూపాయలు కట్టబెట్టిన ఏజెన్సీలు మెడలు వంచి పని చేయించాల్సిన అధికారులు సికిందరాబాద్, ఎల్బీనగర్ జోన్లలో సీఆర్ఎంపీ రోడ్లలో స్వీపింగ్ చేసేందుకు స్వీపింగ్ మిషన్లను అద్దె ప్రాతిపదికన ఎంగేజ్ చేసి, మరో రకంగా బల్దియా నిధులను జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. గత గులాబీ సర్కారులోని కొందరు పెద్దలకు జీహెచ్ఎంసీ నిధులను సంతర్పణ చేసేందుకే ఈ సీఆర్ఎంపీని తెరపైకి తీసుకువచ్చారన్న ఆరోపణలున్నప్పటికీ, మళ్లీ అధికారులు ఈ ప్రతిపాదనను స్టాండింగ్ కమ

Also Read: Cyber Criminals: ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పట్టుబడ్డ 13 మంది సైబర్ నేరగాళ్లు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..