Medchal District: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నిమజ్జనం ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ, భక్తులకు ఏలాంటి అసౌర్యం కలుగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి(Collector Manu Chaudhary) ఆదేశించారు. శనివారం గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల తనిఖీలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికగుప్తా, మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి(DCP Koti Reddy)లతో కలిసి శామీర్ పేట్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడారు.
రాత్రిపూట కూడా నిమజ్టనం
గతంలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ ఈసారి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెరువు పరిసరాలలో నీటి మట్టం తక్కువగా ఉన్నందున నీటి మట్టం ఎక్కువగా ఉన్న మధ్య భాగంలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలన్నారు. విగ్రహాల వాహానాలు వెళ్లేందుకు రహాదారిని పరిశీలించి, వెంటనేరోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అర్ అండ్ బి, పోలీసు(Police), విద్యుతు శాఖల అధికారుల సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. రాత్రిపూట కూడా నిమజ్టనం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అందుకు అవసరమయ్యెలా మసకగా ఉండకుండా వెలుగు ఉండేలా స్తంబాలు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
Also Read: No New Aadhaar: 18 ఏళ్లు పైబడినవారికి కొత్త ఆధార్ ఇవ్వబోం.. ఆ రాష్ట్ర సీఎం ప్రకటన
గతంలో 3 క్రేన్లు
అధిక సంఖ్యలో భక్తులకు సరిపడా మోబైల్ టాయిలెట్లు(Mobile Toilets) ఏర్పాటు చేయాలన్నారు. గతంలో 3 క్రేన్లు పెట్టడం జరిగిందని మున్సిపల్ కవీషనర్ తెలుపగా, ఈ సారి 4 క్రేన్లు పెట్టమని కలెక్టర్ ఆదేశించారు. చెరువు దగ్గరికి భక్తులు వెళ్లకుండా బారిగేడింగ్ నిర్మించాలని సూచించారు. క్రేన్ పెట్టడానికి స్పాట్లను ఏర్పాటు చేయాలని, క్రేన్ ల దగ్గర డ్రెవరు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భక్తులకు త్రాగునీరు, వైద్య సదుపాయం, అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా అధికారులందరు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తూంకుంట మున్సిపల్ కమీషన్ జ్యోతి, ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారి, ట్రాపిక్ ఎసిపి వెంకట్ రెడ్డి, విద్యుత్తు, పోలీస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: తెలంగాణలో హెలీ టూరిజం కాన్సెప్ట్ పై ప్రభుత్వం ఫోకస్!