Minister Tummala Nageswara Rao: కిషన్ రెడ్డిపై మంత్రి తుమ్మల ఫైర్?
Minister Tummala Nageswara Rao (imagecredit:twitter)
Political News

Minister Tummala Nageswara Rao: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి తుమ్మల ఫైర్?

Minister Tummala Nageswara Rao: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో యూరియా కొరత పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే వాస్తవాలు దాచి ఉల్టా రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. యూరియా(Urea) సరఫరాలో జియో పాలిటిక్స్ (Jio Politics)రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎర్ర సముద్రంలో నౌకాయనం నిలవడం వల్ల యూరియా ఇంపోర్ట్ డిమాండ్ కు తగ్గ స్థాయిలో లేదని కిషన్ రెడ్డి ఓ పక్క చెబుతూనే.. మరోపక్క యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆరోపణలు చేయడం వారి ద్వంద వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు.

రైతాంగం పక్షాన కృతజ్ఞతలు

యూరియా దిగుమతులు లేక దేశీయంగా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గ స్థాయిలో లేక నెలకొన్న కొరత పై వాస్తవాలు దాయడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా యూరియా కొరత నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లేలా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కేంద్రమంత్రి స్థాయికి తగినట్లు లేదని హితవు పలికారు. తెలంగాణ ప్రజానీకం మీకు ఓట్లు వేసి గెలిపిస్తేనే కేంద్ర మంత్రి అయ్యారన్నారు. తెలంగాణ రైతాంగం యూరియా కష్టాలు తీరేలా కేంద్ర మంత్రిగా మీరు చొరవ తీసుకుని యూరియా సరఫరా చేయించండి.. అదనంగా యూరియా సరఫరా చేస్తే రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. అలా చేయకుండా కేంద్రం అలసత్వంతో ఏర్పడిన యూరియా కొరత పై వాస్తవాలు దాచి రాజకీయ ఆరోపణలు చేయడం తగునా అని ప్రశ్నించారు.

Also Read: Diabetes Control: షుగ‌ర్ ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదా? అయితే, రోజూ ఈ ఆకుల‌ను తినండి..!

ఇది మూడో పంటకాలం

మంత్రులు పదే పదే చెప్పడం వల్లే రైతులు యూరియా ముందే కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యలు బురద జల్లేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాలో జాప్యం ఇంపోర్ట్ లేకపోవడం దేశీయంగా ఉత్పత్తి లేకపోవడం వల్లేనన్న వాస్తవాలు మా మంత్రులు రైతాంగం కు వివరిస్తుంటే అభాండాలు వేయడం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక ఇది మూడో పంటకాలం. గత ఏడాదిన్నర కాలంలో యూరియా కోసం రైతులు ఎప్పుడు ఆందోళన చెందలేదన్నారు. కేంద్రం కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయక పోవడం వల్లే రైతులు ఆందోళన చెందుతున్నారని, వాస్తవాలు దాచి రాజకీయ ఆరోపణలు చేయడం తగునా? అని కిషన్ రెడ్డిని నిలదీశారు. కేంద్ర మంత్రి హోదాలో బాధ్యతగా కేంద్రం ప్రకటించిన 50 వేల టన్నుల యూరియా తక్షణమే సరఫరా అయ్యేలా చూడాలని రైతాంగం పక్షాన విజ్ఞప్తి చేశారు.

Also Read: Viral Video: రూ.1.8 కోట్ల జీతంతో ఉద్యోగం.. తీరా రోడ్ల వెంట ఐస్‌క్రీమ్ అమ్ముకుంటున్న ఉద్యోగి!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..