Sahiti Infratech Scam (imagecredit:twitter)
హైదరాబాద్

Sahiti Infratech Scam: దూకుడు పెంచిన ఈడీ అధికారులు.. సాహితీ ఇన్ఫ్రా డైరెక్టర్ అరెస్ట్..!

Sahiti Infratech Scam: ప్రీ లాంచ్ ఆఫర్ పేర వందల రూపాయలు కొల్లగొట్టిన సాహితీ ఇన్ ఫ్రాటెక్​ వెంచర్స్ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్(Sahitya Infratech Ventures India Private Limited) డైరెక్టర్ గా పని చేసిన పూర్ణచందర్​ రావు(Poornachander Rao)ను ఎన్​ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. సాహితీ ఇన్ ఫ్రా సంస్థను ప్రారంభించిన భూదాటి లక్ష్మీనారాయణ వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో రెసిడెన్షియల్​ గేటెడ్ కమ్యూనిటీని కడుతున్నామని.. ఫ్లాట్లు, విల్లాలు పూర్తి చేసి ఇస్తామని ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రీ లాంచ్ ఆఫర్(Fre-launch offer) పేర ఏడు వందల మంది నుంచి 8వేల కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

మార్కెటింగ్​ టీం హెడ్​ గా..

అయితే, చెప్పిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిని కూడా పూర్తి చేయలేదు. డబ్బు కట్టిన వారికి రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్(FIR) ల ఆధారంగా ఈడీ అధికారులు కూడా సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ చేపట్టారు. 2024, సెప్టెంబర్ 29న భూదాటి లక్ష్మీనారాయణ(Lakshminarayana)ను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో సాహితీ ఇన్ ఫ్రాలో సేల్స్​, మార్కెటింగ్​ టీం హెడ్​ గా పని చేసిన పూర్ణచందర్​ రావు పాత్ర కూడా ఉన్నట్టుగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. శ్రావణి ఎలైట్ ప్రాజెక్ట్ లో ప్రీ లాంచ్ ఆఫర్ పేర పలువురి నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకున్న పూర్ణచందర్ రావు ఆ వివరాలను రికార్డు చేయలేదని తేలింది.

Also Read: BioDesign Summit: దేవుడు గొప్ప డిజైనర్.. సీఎం రేవంత్ కీలక ప్రసంగం

షెల్ కంపెనీలకు మల్లింపు

ఇక, వసూలు చేసిన డబ్బులో 216కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా నిర్ధారణ అయ్యింది. తన పేర, తన కుటుంబ సభ్యుల పేర భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో 120 కోట్ల రూపాయలను దారి మళ్లించారని, దీంట్లో 50 కోట్ల రూపాయల నగదు ఉందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే పూర్ణచందర్ రావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే 161.50 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: ACB: ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యవసాయాధికారి.. లంచం ఎంత అడిగాడంటే

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..