Medchal Police: 4 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. ఛేదించిన పోలీసులు
Medchal Police (image source: twitter)
హైదరాబాద్

Medchal Police: 4 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. సినిమా రేంజ్‌లో ఛేదించిన పోలీసులు.. ఎలాగంటే?

Medchal Police: కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోని చేధించిన సంఘటన మేడ్చల్ స్టేషన్ (Medchal Police Station) పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా (Prakasam District) కందుకూరు (Kandukuru)కు చెందిన హారిక తన భర్త ప్రసాద్, కొడుకు నేహాంశ్(4) తో కలిసి కండ్లకోయలో నివాసం ఉంటోంది. హారికకు పెళ్లి కాకముందు తన అమ్మ ఇంటి వద్ద ఉంటున్న తిరుపతి (Tirupati) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం తర్వాత వారు స్నేహితులుగా మారి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు.

Also Read: AP New Bar Policy: మందుబాబులకు తీపి కబురు.. రాత్రి 12 గంటల వరకూ మద్యం అమ్మకాలు

దీంతో కొంతకాలం తర్వాత తిరుపతి శారీరకంగా ఉందామని తరచుగా హారికను వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో హారిక ఫోను మాట్లాడటం మానేసింది. ఈ నెల 22వ తేదీన హారిక నివాసానికి వచ్చిన తిరుపతి ఆమెను కొట్టి కొడుకును ఎత్తుకొని వెళ్లిపోయాడు. హారిక వెంటనే మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది.

Also Read: AP New Bar Policy: మందుబాబులకు తీపి కబురు.. రాత్రి 12 గంటల వరకూ మద్యం అమ్మకాలు

రంగంలోకి దిగిన మేడ్చల్ పోలీసులు.. తిరుపతి ఆచూకి కోసం గాలించడం ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే తిరుపతిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకుని బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పచెప్పారు. గంటల వ్యవధిలోని కేసు చేధించిన మేడ్చల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సురేష్ ను ఇతర సిబ్బంది స్థానిక ప్రజలు అభినందించారు.

Also Read: Viral News: బట్టలతో పనిలేని వింత యాత్ర.. షిప్‌లో 11 రోజుల పాటు.. నూలు పోగు లేకుండా..!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..