AP New Bar Policy: ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2025 ఆగస్టు 13న జారీ చేసిన కొత్త జీవోల్లో బార్ షాపులపై గతంలో విధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు బార్ ఆపరేషన్లను మరింత పారదర్శకంగా, ఆర్థికంగా స్థిరత్వంతో, సామాజిక సమానత్వంతో నడపడానికి రూపొందించబడ్డాయి. ఈ నయా బార్ పాలసీ సెప్టెంబర్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2028 వరకు మూడేళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఇంతకీ కొత్త బార్ పాలసీలో చేసిన కీలక మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వారికి 50 శాతం రాయితీ
కొత్త పాలసీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 840 బార్లకు లైసెన్సులు కేటాయించబడ్డాయి. అందులో 10 శాతం బార్లు గీత కార్మికులకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ రిజర్వ్డ్ బార్లకు 50% ఫీజు రాయితీని ప్రభుత్వం అందించనుంది. సామాజిక సమానత్వం, సాధికారత్వాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా బార్ పాలసీలో ఫీజులను ప్రభుత్వం భారీగా తగ్గించింది. 6 వాయిదాల్లో లైసెన్స్ ఫీజును చెల్లించే అవకాశాన్ని కల్పించింది. అయితే బార్లలో రూ.99 ధరలో మద్యం అమ్మకంపై నిషేధం విధించింది. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET) 15%గా విధించారు.
Also Read: RTC Conductor: ఏపీ బస్సుల్లో నయా మోసం.. పురుషులకు స్త్రీ శక్తి ఉచిత టికెట్లు.. ఇదేందయ్యా ఇది!
ఫీజు స్ట్రక్చర్
కొత్త బార్ పాలసీలో లైసెన్స్ ఫీజు.. జనాభా ఆధారంగా నిర్ణయించారు. ప్రతి సంవత్సరం 10% పెరుగుదల ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసంది. 50,000 లేదా అంతకంటే తక్కువ జనాభా ఉన్న చోట బార్ లైసెన్స్ ను రూ.35 లక్షలుగా నిర్ణయించారు. 50,001 – 5,00,000 జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు.. 5,00,000 కంటే ఎక్కువ ప్రజలు ఉన్న నగరాల్లో రూ.75 లక్షలుగా లైసెన్స్ ఫీజును నిర్ణయించారు. రిజర్వ్డ్ వర్గాల వారు మాత్రం పైన పేర్కొన్న ఫీజుల్లో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
Also Read: Viral News: బట్టలతో పనిలేని వింత యాత్ర.. షిప్‌లో 11 రోజుల పాటు.. నూలు పోగు లేకుండా..!
బార్ ఆపరేషన్లు, నిబంధనలు
కొత్త బార్ పాలసీలో బార్ షాపుల టైమింగ్స్ లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ మద్యం విక్రయించే వెసులుబాటును కల్పించింది. అంతేకాదు మధ్యాహ్నం మూసివేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. అయితే అర్బన్ లోకల్ బాడీలు (ULBs), టూరిజం సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, తిరుపతిలో ఆలయ మార్గాలు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఆసుపత్రుల సమీపంలో బార్లకు అనుమతి లేదు.