Illegal Kidney Transplant ( IMAGE credit: twitter)
హైదరాబాద్

Illegal Kidney Transplant: కిడ్నీ రాకెట్‌లో మరో డాక్టర్ అరెస్ట్.. 20కి చేరిన నిందితుల సంఖ్య

Illegal Kidney Transplant: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ అధికారులు మరో డాక్టర్‌(Doctor)ను అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్ ఆర్. వెంకటరమణ సంతోష్ నాయుడుని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య 20కి చేరింది. సరూర్‌నగర్ కొత్తపేటలోని అలకానంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కిడ్నీ దందా జరుగుతుందని సమాచారం అందడంతో మొదట రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించి కొందరిని అరెస్ట్ చేశారు.

 Also Read:Doctor Post Vacancies: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గుడ్‌న్యూస్ 

ఈ కిడ్నీ దందాలో కీలక పాత్ర

దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ఇందులో పాత్ర ఉందని తేలడంతో కేసును సీఐడీకి బదిలీ చేశారు. సీఐడీ అదనపు డీజీపీ చారు సిన్హా తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్లు రాజశేఖర్, అవినాష్‌లతో కలిసి వెంకటరమణ సంతోష్ నాయుడు ఈ కిడ్నీ దందాలో కీలక పాత్ర పోషించారు. అలకానంద ఆస్పత్రితో పాటు జనని, అరుణ హాస్పిటళ్లలో కూడా వీరు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పాములపాటి పవన్ కుమార్ ప్రతీ ఆపరేషన్‌కు వెంకటరమణ సంతోష్ నాయుడును పిలిపించుకునేవాడని, ఒక్కో ఆపరేషన్‌కు అతను రూ. 2.50 లక్షలు వసూలు చేసేవాడని చారు సిన్హా తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది.

Also Raed: Tik Tok In India: భారత్‌లోకి టిక్ టాక్ రీ ఎంట్రీ.. ఓపెన్ అయిన వెబ్ సైట్.. కేంద్రం కీలక ప్రకటన!

 

Just In

01

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?