Damodar-Raja-Narasimha
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Doctor Post Vacancies: హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గుడ్‌న్యూస్

Doctor Post Vacancies:

త్వరలోనే 1690 డాక్టర్ల పోస్టుల భర్తీకి ప్రణాళిక
వయోపరిమితి పెంపుపై కమిటీ అధ్యయనం
త్వరలోనే సెకండరీ హెల్త్‌గా తెలంగాణ వైద్య విధాన పరిషత్ అప్‌గ్రేడ్
హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా శుభవార్త చెప్పారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను (Doctor Post Vacancies) త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. నాన్ టీచింగ్ విభాగంలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీలలో టైమ్ బాండ్ ప్రమోషన్ల భర్తీలో వయోపరిమితి పెంపుపై నిబంధనలు రూపొందించడానికి నిపుణుల కమిటీని నియమిస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను త్వరలోనే సెకండరీ హెల్త్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మార్పు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన టీవీవీవీ కమిషనర్ అజయ్ కుమార్, డాక్టర్ల సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

Read Also- Ravichandran Ashwin: టీమ్ నుంచి నన్ను రిలీజ్ చేయండి.. సీఎస్కే స్టార్ ప్లేయర్ విజ్ఞప్తి

మంత్రికి కృతజ్ఞతలు

ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సేవలు అందిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్స్‌గా పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహాకు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని డాక్టర్లు అంతా హర్షం వ్యక్తం చేశారని మంత్రికి అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు . తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డా.నరహరి, సెక్రటరీ జనరల్ డా.లాలు ప్రసాద్, డా.వినయ్ కుమార్, డా. గోపాల్, డా.క్రాంతి, డా.అశోక్, డా. రామ్ సింగ్‌లు పాల్గొన్నారు.

Read Also- Big Shock to USA: అమెరికాకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న భారత్.. ట్రంప్ బిత్తరపోయే ప్లాన్ ఇదే

కాగా, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మంత్రి దామోదర రాజనర్సింహా గురువారం విడుదల చేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 1,284 పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్వరలోనే చేపట్టనుంది. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయనుంది. సెప్టెంబరు నెలలో కొత్త ఉద్యోగులు హాస్పిటల్స్‌లో విధుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?