CBI Raids Anil Ambani Home: ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీకి సొంత తమ్ముడైన అనిల్ అంబానీకి (Anil Ambani) జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఎస్‌బీఐని దాదాపు రూ.2 వేల కోట్ల మేర రుణ మోసం చేసిన ఆరోపణలపై నమోదై కేసులో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM), కంపెనీ ప్రమోటర్ డైరెక్టర్‌గా ఉన్న అనిల్ అంబానీకు చెందిన నివాస ప్రాంగణాలపై సీబీఐ శనివారం దాడులు (CBI Raids Anil Ambani Home) నిర్వహించింది. విస్తృతమైన సోదాలు నిర్వహించింది. దర్యాప్తులో భాగంగా ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. ఆర్‌కామ్, అనిల్ అంబానీలను మోసానికి పాల్పడిన సంస్థ లేదా వ్యక్తిగా 2024 జూన్ 13న ఎస్‌బీఐ గుర్తించింది. ఆర్బీఐ ‘ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్’ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ఎస్‌బీఐ బోర్డు కూడా ఆమోదం తెలిపింది.
Read Also- Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఊహించని మలుపు
మోసం పెద్దదే..
ఎస్‌బీఐకి ఆర్‌కామ్ చేసిన మోసంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో ఒక ప్రకటన కూడా చేశారు. ఎస్‌బీఐని ఆర్‌కామ్ మోసం చేసిన వ్యవహారంలో రూ.2,227.64 కోట్ల రుణం మాత్రమే కాదని, 2016 ఆగస్టు 26 నుంచి వడ్డీ, నాన్‑ఫండ్‑బేస్డ్ బ్యాంక్ గ్యారంటీ రూ. 786.52 కోట్లు చెల్లించాలని ఆయన వెల్లడించారు. కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ దివాళ చట్టం-2016 కింద దివాళా పరిష్కార ప్రక్రియలో ఉందని వివరించారు. ఈ ప్రక్రియలో సూచించే పరిష్కార ప్రణాళికకు క్రెడిటర్స్ కమిటీ ఆమోదం తెలిపితే, ఎన్‌సీఎల్‌టీ తుది నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.
Read Also- River In China: రివర్స్‌లో ప్రవహిస్తున్న నది.. వీక్షించేందుకు తరలివెళుతున్న జనం
కాగా, ఎస్‌బీఐకి రుణ మోసం కేసులో అనిల్ అంబానీని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రశ్నించింది. మనీ లాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసి ప్రశ్నించింది. ఈ విచారణ జరిగిన రోజుల వ్యవధిలోనే సీబీఐ సోదాలు నిర్వహిస్తుండడం గమనార్హం.
Read Also- Rohit – Virat: కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన