Post Office Scheme (Image Source: twitter)
బిజినెస్

Post Office Scheme: ఈ స్కీమ్ గురించి తెలుసా? రూ.10వేలు పెట్టుబడి పెడితే.. రూ.7 లక్షలు మీవే!

Post Office Scheme: ప్రస్తుత రోజుల్లో పోస్టాఫీసును సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చాలా ముంది చూస్తున్నారు. ఎలాంటి నష్ట భయాలు లేకుండా.. నిర్ధిష్ట కాలానికి గణనీయమైన రాబడిని పోస్టాఫీసు అందిస్తోంది. ఇందుకోసం మనీ డిపాజిట్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వాటిలో ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తున్న స్కీమ్.. ‘పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం’ (Post Office Recurring Deposit (RD) Scheme). ఐదేళ్ల కాలపరిమితి (60 నెలలు)తో తీసుకొచ్చిన ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా.. టర్మ్ పూర్తయ్యే సరికి పెద్ద మెుత్తంలో నగదును పొందవచ్చు. ఇంతకీ ఈ స్కీమ్ ఎలా పనిచేస్తోంది? రూ.10 వేల పెట్టుబడితో ఎంతవరకూ ఆదాయం పొందవచ్చు? ఈ స్కీమ్ ఎంత వడ్డీని ఆఫర్ చేస్తోంది? ఇందులో పెట్టుబడి పెట్టడానికి కావాల్సిన అర్హతలు ఏంటీ? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ స్కీమ్ అనేది 5 సంవత్సరాల (60 నెలలు) కాలవ్యవధిలో నెలవారీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల ద్వారా సేవింగ్స్‌ను ప్రోత్సహించే పథకం. ఇది క్వార్టర్లీ కాంపౌండ్ వడ్డీతో గ్యారంటీ రిటర్న్‌లను అందిస్తుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా మీరు నెలకు రూ.100 నుంచి రూ.10 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఐదేళ్ల కాల వ్యవధి అనంతరం అసలు వడ్డీ కలిపి.. పోస్టాఫీసు మీకు అందిస్తుంది. 2025 జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ప్రకారం ఈ స్కీమ్ వడ్డీ రేటును 6.7% గా నిర్ణయించారు. నెలవారీ డిపాజిట్ చెల్లించడంలో జాప్యం జరిగితే రూ.100కు ఒక రూపాయి చొప్పున డీఫాల్ట్ ఫీజు వసూలు చేస్తారు. ఈ స్కీమ్ లో ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్ ఆప్షన్ కూడా ఉంది. 3 ఏళ్లు పూర్తైన తర్వాత అకౌంట్ ను క్లోజ్ చేసి.. జమ చేసిన మెుత్తాన్ని వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. 12 నెలల డిపాజిట్‌ల తర్వాత మీరు అకౌంట్ బ్యాలెన్స్‌లో 50% వరకు లోన్ పొందవచ్చు.

రూ.10వేలతో రూ.7 లక్షలు ఎలా?
సాధారణంగా ‘పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం’ ఐదేళ్ల కాలపరిమితితో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ప్రతీ నెలా 10 వేలు పెట్టుబడి పెడితే.. 60 నెలలకు గాను రూ.6 లక్షలు జమ అవుతుంది. దీనికి ప్రస్తుత త్రైమాసికం ప్రకారం ఫిక్స్ చేసిన వడ్డీ (6.7%) కలిపితే రూ.1,10,000 అదనంగా లభిస్తుంది. అంటే పెట్టిన రూ.6 లక్షల పెట్టుబడికి టర్మ్ పూర్తయ్యే సరికి రూ.7,10,000 లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఈ స్కీమ్ లో ఆదాయం స్థిరంగా ఉండటంతో పాటు.. ఎలాంటి నష్టభయం ఉండదు.

అర్హతలు (Eligibility Criteria)
పోస్ట్ ఆఫీస్ RD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి కొన్ని అర్హతలను నిర్దేశించారు. 18 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా ఈ స్కీమ్ కింద ఖాతాను ఓపెన్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునేవారికి ముగ్గురు సభ్యులను పరిమితిగా పెట్టారు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్‌ల తరపున గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఆధార్ నంబర్, పాన్ కార్డ్ అవసరం. ఒకవేళ ఆధార్ లేకపోతే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ సమర్పించి 6 నెలల్లో ఆధార్ అందించవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు
RD అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు
1. అప్లికేషన్ ఫారం: పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్ ఓపెనింగ్ ఫారం (Form-A).
2. గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, PAN కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్.
3. చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, యుటిలిటీ బిల్, బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డ్.
4. ఫోటోలు: ఇటీవలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
5. నామినీ వివరాలు: నామినీని నియమించడానికి సంబంధిత ఫారం, సాక్షి సంతకం.

అడ్వాంటేజెస్
పోస్టాఫీస్ ఆర్ డీ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం హామీ ఇచ్చే స్కీమ్ కావడంతో మీ పెట్టుబడి 100% సురక్షితం. సాధారణ ఇంటరెస్ట్ కంటే ఎక్కువ రిటర్న్‌లు లభిస్తాయి. రూ.100 నుంచే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుండటం.. మధ్యతరగతి మంచి ఛాన్స్ గా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఈ స్కీమ్ లో ఎలాంటి రిస్క్ లేదు. అత్యవసర సమయంలో లోన్ అందుబాటులో ఉంటుంది.

అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?
1. ఆఫ్‌లైన్
❄️ సమీప పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లండి.
❄️ RD అకౌంట్ ఓపెనింగ్ ఫారం (Form-A) నింపండి.
❄️ అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించండి.
❄️ కనీసం రూ.100 డిపాజిట్ చేయండి.

Also Read: Tik Tok In India: భారత్‌లోకి టిక్ టాక్ రీ ఎంట్రీ.. ఓపెన్ అయిన వెబ్ సైట్.. కేంద్రం కీలక ప్రకటన!

2. ఆన్‌లైన్
❄️ ఇండియా పోస్ట్ ఈ-బ్యాంకింగ్ వెబ్‌సైట్ లేదా IPPB మొబైల్ యాప్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు (సేవింగ్స్ అకౌంట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే).

Also Read: Donald Trump: భారత రాయబారిగా సన్నిహితుడి పేరు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ