Kukatpally Murder Case: హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలికను అత్యంత క్రూరంగా హత్య చేసినది.. పదో తరగతి చదివే బాలుడని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. ప్రొఫెషనల్ కిల్లర్ లా పక్కా ప్లాన్ తోనే బాలికను లేపేసినట్లు నిర్ధారించారు. ‘దొంగతనం ఎలా చేయాలి? అడ్డొస్తే ఏం చేయాలన్నది నిందితుడు ముందుగానే పేపర్ పై రాసిపెట్టుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
కత్తితో విచ్చల విడిగా పొడిచి
‘హౌ టూ ఎంట్రీ, హౌ టూ బ్రేక్ గాడ్ హుండీ’ అని మైనర్ బాలుడు ముందుగానే ఓ పేపర్ లో రాసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లేటప్పుడు తన వెంట కత్తిని తీసుకెళ్లాడు. హుండీని బ్రేక్ చేసి అందులో రూ.80 వేలు దోచుకున్నాడు. డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర.. బాలుడ్ని గుర్తించింది. తన తల్లిదండ్రులకు చెప్పేస్తానని బెదిరించింది. దీంతో బాలికపై కూర్చొని ఆమె గొంతు నులిమి బాలుడు హత్య చేశాడు. అయితే చనిపోయిందో లేదోనని సందేహాపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని భావించి వెంట తెచ్చుకున్న కత్తితో విచ్చలవిడిగా సహస్రను పొడిచినట్లు పోలీసులు అంచనా తెలిపారు.
Also Read: Sedan SUVs – GST: గుడ్ న్యూస్.. కారు చౌకగా ఎస్‌యూవీ, సెడాన్లు.. అప్పు చేసైనా కొనేయాలి!
సాఫ్ట్ వేర్ ఇచ్చిన సమాచారంతో..
మైనర్ బాలుడి దాడిలో సహస్ర శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు పడ్డాయి. మెడ, గొంతు, కడుపులో తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే హత్య అనంతరం బాలుడు.. పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాల పాటు దాక్కున్నాడు. ఆ సమయంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బాలుడ్ని చూశాడు. అతడు ఇచ్చిన సమాచారంతోనే బాలుడు చదువుతున్న స్కూలు వెళ్లిన పోలీసులు.. మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లెటర్, కత్తి, రక్తంతో తడిచిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Viral Video: తిందామని చూసిన యువతిని.. గుక్కపెట్టి ఏడ్చేలా చేసిన రొయ్య.. వీడియో వైరల్
సహస్ర ఒంటరిగా ఉండటంతో..
కూకట్‌పల్లి(Kukatpally) సంగీత్ నగర్‌లో నివాసముంటున్న 12 ఏళ్ల సహస్ర.. సోమవారం (ఆగస్టు 18న) దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. రేణుక, కృష్ణ దంపతులకు సహస్ర (12), కుమారుడు ఉన్నారు. రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తుండగా కృష్ణ బైక్ మెకానిక్. కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న సహస్ర స్కూల్ కు సెలవులు ఉండటంతో ఇంటి వద్దనే ఉంటోంది. సోమవారం రేణుక, కృష్ణలు తమ తమ పనులపై వెళ్లిపోయారు. వారి కుమారుడు స్కూల్ కు వెళ్లగా సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమె ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన బాలుడు.. సహస్రను హత్య చేసి పరారయ్యాడు.