Diabetes Control: మనలో చాలా మంది డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. రోజురోజుకూ డయాబెటిస్ సమస్య విస్తరిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ లెవల్స్) అధికంగా ఉండటాన్ని డయాబెటిస్ అంటారు, ఇది ప్రధానంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌గా రెండు రకాలుగా ఉంటాయి. జీవనశైలిలో మార్పులు, సహజ ఆహారాల ద్వారా ఈ సమస్యను గణనీయంగా నియంత్రించవచ్చు. డయాబెటిస్ నియంత్రణకు సహాయపడే కొన్ని ఔషధ ఆకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం
1. పుదీనా (మింట్ లీవ్స్)
పుదీనా ఒక రిఫ్రెషింగ్ హెర్బ్, ఇది డయాబెటిస్ ఉన్నవారికి అద్భుతమైన ఎంపిక. ఇందులో విటమిన్ ఎ, ఐరన్, ఫోలేట్, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
ఎలా తీసుకోవాలి?
పుదీనా ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. పుదీనా ఆకులతో టీ తయారు చేసి తాగడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
2. తులసి
తులసి ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించే ఔషధ మొక్క. ఇది శ్వాసకోశ సమస్యలు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంతో పాటు, డయాబెటిస్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది. తులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్ , ఎంజైమ్స్ పుష్కలంగా ఉండి, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి.
ఎలా తీసుకోవాలి?
ఉదయం ఖాళీ కడుపుతో 10-15 తాజా తులసి ఆకులను నమిలి తినండి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
3. కరివేపాకు
కరివేపాకు భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే ఆకు, ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
8-10 కరివేపాకులను ఉదయం నమిలి తినండి. అలాగే వీటిని కూరలు, సలాడ్స్, లేదా చట్నీలలో చేర్చి తినవచ్చు.
4. మామిడి ఆకులు
మామిడి ఆకులు డయాబెటిస్ నియంత్రణకు సహజమైన సమర్థవంతమైన మార్గం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలా తీసుకోవాలి?
5 నుంచి 6 మామిడి ఆకులను నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించండి. వడకట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.