Vikarabad district(image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Vikarabad district: వికారాబాద్‌లో సంతోష్ ఏజెన్సీస్ గుట్కా స్కామ్.. డీఎస్పీ కార్యాలయం పక్కన మత్తు దందా!

Vikarabad district: డీఎస్పీ కార్యాలయానికి అద్దెకిచ్చిన భవనం మనదే  మనం ఏం చెబితే అదే.. గుట్కాలు ఉన్న కంటైనర్ ను పోలీస్ స్టేషన్(Police station) తీసుకువెళ్తే ఐదు నిమిషాల్లో విడిపించుకుంటానంటూ ఏజెన్సీ నిర్వాహకుడు కండకవరంతో మాట్లాడిన మాటలు ఆశ్చర్యానికి గురిచేసాయి. వికారాబాద్ జిల్లా(Vikarabad District) పరిగి పట్టణంలో డీఎస్పీ కార్యాలయం పక్కనే సంతోష్ ఏజెన్సీస్(Santosh Agencies) నిర్వహిస్తున్నాడు. సిగరెట్స్, ఆశీర్వాద్ , చిప్స్ తదితర రిటైల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు పైకి బోర్డులు పెట్టి కొంతకాలం నిషేధిత గుట్కాలు, తంబాకు, తదితర మత్తు కర్ణాటక నుంచి తీసుకువచ్చిన జిల్లా వ్యాప్తంగా విక్రయాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రాత్రి 10.30 గుట్కా, తంబాకు తదితర మత్తు పదార్థాలు సంతోష్ ఏజెన్సీ(Santosh Agencies) లో దింపుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కంటైనర్ డీసీఎం వ్యాన్ పోలీస్ స్టేషన్(Police station) తరలించారు.

 Also Read: Good News to Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు.. ఈ నెల 26న ప్రమోషన్ల ఉత్తర్వులు

50 సంచలకు పైగా

ఈ విషయమై స్థానిక ఎస్ఐ మోహన్ కృష్ణ ను వివరణ కోరగా కంటైనర్ ఇంకా ఓపెన్ చేయలేదని ఓపెన్ చేశాక అందులో ఏమున్నదని నిర్ధారిస్తామని తెలిపారు. ఎట్టకేలకు స్థానికులు, మీడియా ఒత్తిళ్లతో పోలీస్ స్టేషన్(Police station) ముందు పవర్ కట్ చేయించి, మున్సిపల్ సిబ్బందితో కంటైనర్ లోంచి సుమారు 50 సంచలకు పైగా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. ఆ సంచుల్లో గుట్కాలు ఉన్నాయా మరి ఏమి ఉన్నాయి అన్న విషయం పై ఎస్సై మోహన్ కృష్ణను వివరణ కోరగా ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చాకే అందులో ఏమున్నాయి అనేది నిర్ధారిస్తామంటూ చెప్పారు.

గుట్కా వ్యాపారం

అందులో గుట్కాలు ఉన్నాయన్న విషయం తెలిసి కూడా సమాచారమిచ్చేందుకు ఎందుకు వెనకాడుతున్నారంటూ అనుమానిస్తున్నారు. గుట్కాల వ్యాపారిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు.  రాత్రి 10 గంటలకు పట్టుకున్న కంటైనర్ వ్యాన్ ను ఓపెన్ చేసేందుకు 24 గంటల సమయం ఎందుకు పట్టిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే సంతోష్ ఏజెన్సీస్ విరువాకుడు చెప్పిన మాటలు నిజమేనని అనిపిస్తున్నాయంటూ మున్సిపల్ ప్రజలు తప్పుపడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం చేస్తూ, డీఎస్పీ కార్యాలయాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను మేనేజ్ చేసి మత్తు దందా చేస్తున్నాడా అంటూ మున్సిపల్ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Secunderabad Patny: గుడిలో అమ్మవారి విగ్రహం మాయం?.. ఎక్కడంటే!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది