Mega 157 Title Glimpse: ఎంట్రీ అదుర్స్.. బాసూ చూపీయ్ నీ గ్రేసు!
chiru ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Mega 157 Title Glimpse: అనిల్ రావిపూడి స్కెచ్ అదిరిందిగా.. మెగా 157 టైటిల్ రిలీజ్.. బాసూ చూపీయ్ నీ గ్రేసు!

Mega 157 Title Glimpse: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షైన్ స్క్రీన్స్, చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తున్న గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది, చిరు సరసన హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు.

Also Read: Vikarabad district: వికారాబాద్‌లో సంతోష్ ఏజెన్సీస్ గుట్కా స్కామ్.. డీఎస్పీ కార్యాలయం పక్కన మత్తు దందా!

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాజాగా, చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఊహాగానాలకు సరిగ్గా సరిపోయేలా, ఈ మూవీకి మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Also Read: Chiranjeevi – Pawan Kalyan: త‌మ్ముడు కళ్యాణ్.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి.. చిరంజీవి ట్వీట్ వైరల్

మన శంకర వర ప్రసాద్ గారు పండగకి రావడం కాదు. ఆయన వచ్చాకే పండగ వస్తది.. జై చిరంజీవ. ఇదీ..! ఇదికదా మాకు కావాల్సినది..!! అన్నయ్యా ఇరగదీశారు. సంక్రాతికి బాక్సాఫీస్ బద్దలైపోవాలి. మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయి, 70సంవత్సరాలు అంటే నమ్మడం కావట్లే. విక్టరీ వెంకటేష్ అన్న వాయిస్ ఈ సినిమాలో ఉంటే.. సూపర్ ఉంటుంది. ఆయన్ను కూడా ఈ సినిమాలో పెట్టండి గురు. థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఇది విక్టరీ వెంకటేష్ అభిమానులందరి కోరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?