Chiranjeevi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi – Pawan Kalyan: త‌మ్ముడు కళ్యాణ్.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి.. చిరంజీవి ట్వీట్ వైరల్

Chiranjeevi – Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆయన తన 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ , సినీ పరిశ్రమలోని సహానటులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు విషెస్ తెలుపుతున్నారు. అయితే, చిరంజీవి గోవాలో తన కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో ఈ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా తమ్ముడు హీరో పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపాడు. దీనికి సంబంధించిన ట్వీట్ ను ఎక్స్ లో చిరంజీవి పంచుకున్నారు.

Also Read: Star Hero Family: ఆ స్టార్ హీరో ఫ్యామిలీలో అందరూ ఎఫైర్స్ మాస్టర్లే.. పెద్ద రసికులంటూ బిగ్ బాంబ్ పేల్చిన దర్శకుడు?

ఆయన ఎక్స్ లో ” త‌మ్ముడు క‌ల్యాణ్‌.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌.. ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుందని ” అన్నారు.

Also Read: Chiranjeevi – Pawan Kalyan: త‌మ్ముడు కళ్యాణ్.. ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి.. చిరంజీవి ట్వీట్ వైరల్

” ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను ” అని ఎక్స్ లో రాసుకొచ్చారు.

Also Read: Shreyas Iyer Father: ఆసియా కప్‌లో అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై అతడి తండ్రి సంచలన వ్యాఖ్యలు

చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న అనిల్ రావిపూడి డైరక్షన్లో చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు గ్లింప్స్ విడుదల కానుంది. అలాగే, బాబీ దర్శకత్వంలో మరో కొత్త సినిమా ప్రకటన కూడా మేకర్స్ ఈ రోజు విడుదల చేయనున్నారు.

స్టాలిన్ 4K రీ-రిలీజ్

చిరంజీవి నటించిన 2006 కల్ట్ క్లాసిక్ స్టాలిన్ ఈ రోజున 4Kలో రీ-రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ఆగస్టు 22  న అమెరికా, యూకేలో స్పెషల్ షోలతో రిలీజ్ కానుంది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?