Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సామాన్యులను హౌస్‌లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెలక్షన్ ప్రాసెస్. ఈ షో ఆగస్టు 22, 2025 నుంచి సెప్టెంబర్ 5, 2025 వరకు జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఫిల్టర్ చేసి, టాస్క్‌లలో రాణించిన వారిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తారు.
Also Read: Tummala Nageswara Rao: అధికారం కోల్పోయిన పార్టీలవి చిల్లర మాటలు.. మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్
ఈ షోకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. జడ్జ్‌లుగా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్, సీజన్ 1 కంటెస్టెంట్ నవదీప్, బిగ్ బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) విన్నర్ బిందు మాధవి ఉన్నారు. లక్షలాది దరఖాస్తుల నుంచి మొదట 100 మందిని, ఆ తర్వాత 45 మందిని, చివరగా 15 మందిని ఎంపిక చేశారు. ఈ 15 మంది మూడు గ్రూపులుగా విభజించబడి, వివిధ టాస్క్‌లను ఆడించి ఎంపిక చేస్తారు. ప్రతి గ్రూప్ నుంచి ఒకరు, మొత్తం ముగ్గురు బెస్ట్ పెర్ఫార్మర్స్‌గా ఎంపికవుతారు. మిగిలిన 12 మందిలో ఓటింగ్ ద్వారా టాప్ 2 మందిని ఎంపిక చేసి, మొత్తం 5 మంది బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపిక చేస్తారు.
అయితే, బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఒక మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. చూడబోతుంటే ఇతను సెలెక్ట్ అయ్యేలాగే ఉన్నాడు. జడ్జెస్ ఏం అడుగుతున్నా రివర్స్ ఆన్సర్స్ చెబుతున్నాడు. ఇక ఇదే క్రమంలో నువ్వు విడాకులు తీసుకున్నావా అని శ్రీముఖి అతన్ని అడగగా.. అతను అప్పుడు కూడా తల తిక్క ఆన్సర్ చెప్పాడు. ఇక జడ్జెస్ ఓపిక నశించి అతని మెడలో లూజర్ అనే బోర్డ్ తగిలించారు. విలువల గురించి మాట్లాడే నువ్వు భార్య మీద చేయి ఎత్తడం అది మంచి విలువా అని బిందు మాధవి అతన్ని అడగగా.. సారి నేను భార్య మీద చేయి ఎత్తానని మీరు నువ్వు అని సంబోధించి మాట్లాడుతున్నారు? నువ్వు నా దృష్టిలో ఓడిపోయావు.. నేను నువ్వు అనే మాట్లాడతాను అని బిందు మాధవి గట్టిగా ఇచ్చి పడేసింది. మీరు ఒక్క నిముషంలో నన్ను జడ్జ్ చేయడానికి మీరు దేవుళ్ళు అయి ఉండాలి? సారి నేను ఏం దేవుడిని కాదని ఫైర్ అయింది. దీని పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
