Hydraa: మహానగరంలో ఇటీవల కురిసిన వర్షాలతో కూకట్‌పల్లి నల్ల చెరువు(Kukatpally Black Pond) నిండింది. జలకళను సంతరించుకోవటంతో స్థానికంగా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. హైడ్రా(Hydraa) హయాంలో చెరువులకు కబ్జాల నుంచి విముక్తి కల్గించటంతో పాటు గతంలో ఉన్న చెరువు ఇపుడెంత శోభను సంతరించుకుందో చూడాలంటే కూకట్‌పల్లి నల్లచెరువును సందర్శించాల్సిందే. నిర్మాణ వ్యర్థాలతో నిండి, మురికి కూపంగా మారి చివరకు చెరువు ఆనవాళ్లనే కోల్పోయిన దశ నుంచి ఆ చెరువు నేడు ఓ జలాశయంగా దర్శనమిస్తుంది. హైడ్రా చేపట్టిన చర్యల కారణంగా కబ్జాల చెర నుంచి బయటపడి, మురుగును వదిలించుకుంది. పేరుకుపోయిన చెత్తను తొలగించుకుంది. కేవలం నాలుగు నెలల్లో చెరువు రూపురేఖలు మారిపోయాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండలా కనిపిస్తోంది. అక్కడి స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది కూకట్‌పల్లి నల్ల చెరువు. బోటు షికారుకు చిరునామా అయ్యింది. ఎన్నో ప్రయాసలు, ఎన్ని ఎదురు దెబ్బల, మరెన్ని విమర్శలను సైతం తట్టుకుని పని చేసిన హైడ్రా కష్టానికి ఫలితమైంది. హైడ్రా పని తనానికి నిదర్శనంగా నిలిచింది. చెరువు అభివృద్ధిపట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గొలుసుకట్టు చెరువులతో వరదను నివారించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్న హైడ్రా సిబ్బందిలో ఆత్మవిశ్వాశాన్ని నింపింది. గురువారం నల్ల చె(Hydra Commissioner AV Ranganath) సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
Also Read; Army jawan: దేశంలో దారుణం.. స్తంభానికి కట్టేసి మరి.. జవాన్‌ను చితకబాదారు!
రెట్టింపయిన చెరువు విస్తీర్ణం
కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలతో కుంచించుకుపోయి 16 ఎకరాలుగా మిగిలిపోయింది. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. చెరువలోకి జరిగి ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డులను హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే గాక, 4 మీటర్ల లోతు మట్టిని కూడా తొలగించింది. అప్పుడు కాని దుర్గంధం దూరమవ్వలేదు. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయ్యిందని, కేవలం 4 నెలల్లో 28 ఎకరాల మేర చెరువు తయారయ్యిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇంతలో వర్షాకాలం, ఒకటి రెండు వర్షాలకే చెరువు నిండింది. ఈ చెరువు నిర్మాణంలో అన్ని శాఖల సహకారం ఉందని, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఇలా అన్ని పార్టీలకు చెందిన వారు కూడా సహకరించారని కమిషనర్ వ్యాఖ్యానించారు.
నివాసాలను తప్పిన వరద ముప్పుు
కూకట్‌పల్లి నల్ల చెరువు చుట్టూ నివాస ప్రాంతాలున్నాయి. వర్షం పడితే, చెరువులోకి వెళ్లడానికి దారి లేక వరదంతా నివాస ప్రాంతాలను ముంచెత్తేది. ఇప్పుడు నల్ల చెరువులోకి 7 ఇన్‌లెట్ల ద్వారా చేరుతోంది. చెరువు నిండితే సులభంగా వెళ్లేందుకు గతంలో ఉన్న ఔట్‌లెట్‌ను అభివృద్ధి చేయడమే కాకుండా మరొకటి నిర్మిస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. మురుగు నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించామని, బోటు షికారు జోరుగా సాగుతోంది. భూగర్భ జలాలు పెరిగాయని, బోర్లు జీవం పోసుకున్నాయని ఆయన వెల్లడించారు. చెరువు చుట్టూ దాదాపు కిలోమీటరున్నర పాత్ వే అందుబాటులోకి వచ్చిందని, దాదాపు 600ల మంది వాకర్లు వాకింగ్ చేస్తున్నారని కమినర్ పేర్కొన్నారు. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారిందని, ఆరోగ్య పరంగా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని, చిన్నపాటి వేడుకలకు కూడా ఇక్కడ కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, మల్టీ పర్పస్‌గా దీనిని తయారు చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.
Also Read: Red Rainbow: అరుదైన అద్భుతం.. సింగిల్ కలర్ రెడ్ రెయిన్‌బో.. భలే గమ్మత్తుగా ఉందే!