Army jawan: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మీరట్ జిల్లా (Meerut District)లో దారుణం చోటుచేసుకుంది. ఓ టూల్ బూత్ సిబ్బంది ఆర్మీ జవాన్ ను స్తంభానికి కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
దాడికి గురైన జవాన్ కపిల్ కావడ్ (Kapil Kavad). ఆయన భారత సైన్యం (Indian Army)లో రాజ్‌పుత్ రెజిమెంట్ (Rajput Regiment)లో పని చేస్తున్నారు. ఇటీవల సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన ఆయన తిరిగి తన విధుల్లో చేరేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి (Delhi airport) బయలుదేరారు. అక్కడి నుంచి శ్రీనగర్‌లోని తన పోస్టింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కపిల్ తన బంధువుతో కలిసి కారులో వెళ్తుండగా భుని (Bhuni toll boot) వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఫ్లైట్ మిస్ అవుతుందేమో అన్న ఆందోళనతో కపిల్ వాహనం నుంచి బయటికి వచ్చి టోల్‌బూత్ సిబ్బందితో మాట్లాడారు.
Also Read: Chinese Robot: ఓర్నాయనో పిల్లలను కనే రోబోలు. ఇక మహిళలు హ్యాపీగా ఉండొచ్చు!
టోల్ బూత్ సిబ్బందితో వాగ్వాదం
టోల్ బూత్ గుండా వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సిబ్బందిని జవాన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో వారితో కపిల్ కు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బూత్ లోని సిబ్బంది (booth employees).. కపిల్ పై దాడి చేశారు. అడ్డుకోబోయిన బంధువును సైతం కొట్టారు. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. వీడియోలో టోల్ బూత్ సిబ్బంది కర్రతో కపిల్ పై దాడి చేయడం కనిపించింది. జవాన్ ను స్తంభానికి కట్టేసి దుర్భషలాడుతూ కొడుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి.
An Army jawan, Kapil Kavad of the Rajput Regiment, was assaulted by toll booth staff in Meerut while heading to catch a flight for his posting in Srinagar.
A video showed him being pinned to a pole and beaten with sticks. Police registered a case after his family’s complaint,… pic.twitter.com/AEc1BZCuMJ
— Mid Day (@mid_day) August 18, 2025
Also Read: Telangana Cricket Association: క్రికెట్ పేరుతో రూ.12 కోట్లు దుర్వినియోగం.. నేర చరిత్ర ఉన్నవారు ఇంకా పదవుల్లోనే!
జిల్లా ఎస్పీ ఏమన్నారంటే?
జవాన్ పై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మీరట్ జిల్లా రూరల్ ఎస్పీ రాకేష్ కుమార్ మిశ్రా (Rakesh Kumar Mishra) మాట్లాడుతూ ‘కపిల్ ఇండియన్ ఆర్మీకి చెందినవారు. తన పోస్టింగ్‌కి తిరిగి వెళ్తున్నాడు. భుని టోల్‌బూత్ వద్ద భారీ క్యూలు ఉండడంతో తొందరపడి సిబ్బందితో మాట్లాడాడు. అక్కడ వాగ్వాదం జరిగి దాడికి దారి తీసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సరూర్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నాం’ అని తెలిపారు. అలాగే ‘సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియోల ఆధారంగా నలుగురిని అరెస్టు చేశాం. మిగతా నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి’ అని చెప్పారు. కొన్ని నివేదికల ప్రకారం.. కపిల్ తన గ్రామం టోల్ మినహాయింపు జాబితాలో ఉందని సిబ్బందికి చెప్పడంతో వివాదం మొదలై అది గొడవకు దారి తీసిందని సమాచారం.