Chinese Robot (Image Source: Twitter)
Viral

Chinese Robot: ఓర్నాయనో పిల్లలను కనే రోబోలు. ఇక మహిళలు హ్యాపీగా ఉండొచ్చు!

Chinese Robot: సాంకేతిక రంగం నానాటికి కొత్త పుంతలు తొక్కుతోంది. కనీవినీ ఏరుగని అసాధ్యాలను సుసాథ్యం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు మానవ సృష్టికి సంబంధించిన అద్భుతాన్ని సాకారం చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే తొలి ‘గర్భధారణ రోబోట్’ (Gestation robot) పై వారు పనిచేస్తున్నారు. ఈ రోబోట్ ద్వారా నిజమైన శిశువు జన్మించగలదని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’ (The Telegraph) తెలిపింది. గర్భంలో పిండం ఏర్పడే దగ్గర నుంచి ప్రసవం వరకూ అన్ని ప్రక్రియలు జరిగేలా సరికొత్త రోబోటిక్ సాంకేతికతను రూపొందిస్తున్నారు.

గర్భం ఎలా సాధ్యమంటే?
సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చలంటే ఆమెలో విడుదలయ్యే అండం.. మగవారిలోని వీర్య కణం ఫలదీకరణం చెందాల్సి ఉంటుంది. అప్పుడు అది పిండంగా మారి 9 నెలలకు శిశువు గర్భం నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు గర్భధారణ రోబోట్ల విషయంలోనూ ఇదే విధానాన్ని శాస్త్రవేత్తలు అనుసరించబోతున్నారు. రోబోట్ కు ఏర్పాటు చేసిన కృత్రిమ గర్భశయంలో ఈ ఫలదీకరణ ప్రక్రియ కృత్రిమంగా జరిగేలా శాస్త్రవేత్తలు చేయబోతున్నారు.

వారికి ప్రయోజనం..!
ప్రపంచంలోని తొలి గర్భధారణ రోబోట్ ను చైనా గ్వాంగ్‌జౌ (Guangzhou)లోని కైవా టెక్నాలజీ సంస్థ (Kaiwa Technology) అభివృద్ధి చేస్తోంది. దీనికి సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ  (Nanyang Technological University) కి చెందిన శాస్త్రవేత్త డా. జాంగ్ కీఫెంగ్  (Dr Zhang Qifeng) నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు లేదా గర్భధారణకు సిద్ధంగా లేని స్త్రీలకు ఇది తోడ్పటు అందించనుంది.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
డా. జాంగ్ ప్రకారం.. ఈ సాంకేతికత ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ‘ఇప్పుడీ టెక్నాలజీని రోబోట్‌ పొట్టలో అమర్చాలి. అప్పుడు ఒక నిజమైన వ్యక్తి , రోబోట్ పరస్పర చర్యలో పాల్గొని గర్భధారణ సాధ్యమవుతుంది. తద్వారా శిశువు రోబోట్‌లోపల పెరుగుతుంది’ అని చెప్పారు. అయితే 2026 నాటికి ప్రోటోటైప్ విడుదల కానుందని అంచనా. దీని ఖర్చు సుమారు 1,00,000 యువాన్‌ (దాదాపు 14,000 అమెరికన్ డాలర్లు)గా భావిస్తున్నారు.

ప్రయోగంపై భిన్నాభిప్రాయాలు!
గర్భధారణ రోబోట్ల అంశం.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఒక తల్లికి బిడ్డకు ఉండే అనుబంధం.. ఈ ప్రయోగం వల్ల దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే అండం, వీర్యకణం ఫలదీకరణం చెందే ప్రక్రియపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోబోట్లకు జన్మించే బిడ్డల మానసిక పరిస్థితి సాధారణంగా జన్మించేవారిలాగే ఉంటుందా? లేదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Udaya Bhanu: వాళ్ళకి త్వరలో నేనేంటో చూపిస్తా.. గుట్టు మొత్తం బయట పెడతా.. ఉదయభాను

వారికి మాత్రం వరమే!
గర్భధారణ రోబోట్లపై జరుగుతున్న ప్రయోగాంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. సంతానం లేని తల్లిదండ్రులకు ఇది వరంగా మారబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో సుమారు 15 శాతం మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ రోబో టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. బిడ్డను కనాలన్న వారి కల సాకారం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కృత్రిమ గర్భాశయ పరిశోధన జంతువుల్లో చాలా ఏళ్ల క్రితమే నిర్వహించగా అధి మంచి ఫలితాలు ఇచ్చింది. 2017లో ముందుగానే పుట్టిన ఒక గొర్రె పిల్లను కృత్రిమ అమ్నియోటిక్ ద్రవం (Synthetic amniotic fluid)తో నిండిన ‘బయోబ్యాగ్’ (biobag) లో విజయవంతంగా పెంచారు. ప్రస్తుతం డా. జాంగ్ బృందం గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ (Guangdong Province) అధికారులతో కలిసి ఈ సాంకేతికతకు సంబంధించిన చట్టపరమైన, నైతిక అంశాలపై విధానపరమైన చర్చలు జరుపుతోంది.

Also Read This: 15th Finance Commission: గ్రామ పంచాయతీలకు 3వేలకోట్లు పెండింగ్గ్.. మొత్తంగా రావలసిన నిధులు రూ.4200 కోట్ల పైనే

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ