Dharur PACS: రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)లో దొంగలు పడ్డారు. రాజకీయ నేతల అండదండలతో ధరూర్ సొసైటీలో ఓ అధికారి రూటే సపరేట్ గా మారింది. సొసైటీలోని అధికారి ఇష్టారాజ్యంగా అనేక అక్రమాలు నెలకొన్నాయని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ధరూర్ సొసైటీ పరిధిలో పాతపాలెం, అల్వాల్ పాడు, ఉప్పేర్ పీఏసిఎస్ సెంటర్లు ఉన్నాయి. ధరూర్ పీఏసిఎస్ ఈ సొసైటీ కింద ధరూర్(Dharur)మండల కేంద్రంలో సూపర్ మార్కెట్, బురెడ్డిపల్లి రోడ్ లో ఓ పెట్రోల్ బంక్ ఉన్నాయి.
వీటిలో తాత్కాలిక ఉద్యోగుల నియామకం ప్రభుత్వ నిబంధనల మేరకు జరగాలి. అవేమి పట్టని ఆ అధికారి… తన బందవులను ఎంప్లాయిస్ గా నియమించుకుని తనకంటూ ఓ చీకటి సామ్రాజ్యాని ఏర్పాటు చేసుకున్నట్లు అరోపణలు. హెచ్‌ఆర్ పాలసీకి తూట్లు పొడుస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపడుతూ రాజకీయ నేతలు అండలతో ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టినట్లు ఆరోపణలు. రైతులకు ఇవ్వాల్సిన రుణాలు సకాలంలో ఇవ్వక కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నట్లు ఆరోపణలు. రుణాలు కావాలంటే మూఠ కట్టాల్సిందేనని రైతులు(Farmers)ఆరోపించారు. సొసైటీలో అంతా నా ఇష్టం నేను చెప్పిందే వేదం.. అన్న తరహాలో ఆ అధికారి వ్యవహార శైలీ. ధరూర్ పీఏసిఎస్(PACS)లోన్ల అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. పీఏసీఎస్‌లో, రైతు లోన్‌కు సంబంధించిన డేటా చూపించాలంటే చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
యూరియా పక్కదారి…
జిల్లాలో ధరూర్(Dharur పీఏసిఎస్ సంఘానికి యూరియా పెద్ద మొత్తంలో సరఫరా చేసినట్లు తెలిసింది. నిరక్షరాస్యులైన రైతులను ఆసరా చేసుకుని రైతుల(Farmers) పాసు పుస్తకాలతో యూరియాను పెద్ద మొత్తంలో బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ ఏ రైతుకు ఎంత యూరియా పంపిణి చేశారో రికార్డులు తారుమారు చేసి యూరియాను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లోన్ కావాలంటే నోట్ల మూఠ ఇయ్యాల్సిందే
ధరూర్ సొసైటీలో రైతులకు దీర్ఘకాలిక, క్రాప్ లోన్లు కావాలంటే ఆ అధికారికి కప్పం చెల్లించకతప్పదని రైతులు(Farmers) వాపోతున్నారు. లేదంటే మార్ట్ గేజ్ లోన్ కు సంబంధించిన సర్క్యూలర్ కాగితాలు చూపెట్టి నెలలు తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా రైతులు పాసు పుస్తకాలు పెట్టి తీసుకున్న లోన్ ల పై ముందస్తుగా ఎంతో కొంత పైసలు ఆ అధికారి తీసుకుంటున్నట్లు, లోన్ లు పూర్తి అయ్యాక తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు వాగ్వివాదానికి దిగినట్లు గతంలో ఈ పంచాయతీలు ధరూర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినట్లు పుకార్లు. సొసైటీలో క్రాప్ లోన్లు, మార్ట్ గేజ్ లోన్లు తీసుకున్న రైతు పాసు పుస్తకాలపై ఇతర లోన్ లు ఎత్తినట్లు కూడా సమాచారం. ఇలా తీసుకున్న లోన్లు కట్టని పక్షంలో ఓ లీడర్ సెటిల్మెంట్ చేసినట్లు కొన్నేండ్ల కింద ధరూర్ మండల కేంద్రంలో చర్చించుకున్నారు.
నామమాత్రంగా పాలకవర్గం
ధరూర్ పీఏసిఎస్ పాలకవర్గం నామమాత్రం ఉండటంతో అంతా సీఈఓ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరూర్ పీఏసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 11 మంది డైరెక్టర్ లున్నారు. పీఏసిఎస్ సెంటర్ లో వ్యాపారా లావాదేవీలు పీఏసిఎస్ పాలక వర్గానికి తెలియకుండానే జరుగుతున్నట్లు పాలకవర్గం డైరెక్టర్ లు ఆరోపించారు. ఏదైన అడిగితే సమాధానం చెప్పేవారు కరువయ్యారని అంటున్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
