DCC Presidents: ఎట్టకేలకు డిసిసి(DCC) అధ్యక్షుల ఎంపికపై కసరత్తు పూర్తి కావస్తోంది. జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న 13 మందిలో చివరకు నలుగురు ఆశావాహుల పేర్లు పరిశీలనకు వచ్చింది. పార్టీకి విధేయత, సామాజిక సమీకరణాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలో ఏఐసీసీ(AICC) చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరిందని సమాచారం. తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి పార్టీకి అంకితభావంతో పని చేస్తూ క్షేత్రస్థాయి నుంచి వివిధ దశలలో పార్టీ పదవులను చేపట్టి ఎట్టకేలకు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నల్లారెడ్డికి అధ్యక్ష పదవికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని జిల్లాలో జోరుగా ప్రచారం నడుస్తోంది.
పార్టీ కోసం ఐదేళ్లు సేవలు తప్పనిసరి
కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్దతో పనిచేసిన వారికి పార్టీ పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా కనీసం పార్టీలో ఐదేళ్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన పెట్టింది. పార్టీ అధికారంలోకి రాకముందు జిల్లా కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్షుడిగా పటేల్ ప్రభాకర్ రెడ్డి(Patel Prabhakar Reddy) పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలం అధికారంలో లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి గద్వాల నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ బిఆర్ఎస్ లో చేరారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పెరిగిన పోటీ
జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య ఈ సారి పెరిగింది. ఈ మేరకు ఆశావాహులు నుంచి పరిశీలకులుగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి(Narayana Swamy)కి దరఖాస్తులను అందజేశారు. జోగులాంబ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న నల్లారెడ్డి(Nalla Reddy)తో పాటు రాజీవ్ రెడ్డి(Rajiv Reddy), షేక్షావలి ఆచారి, నారాయణరెడ్డి, గట్టు గౌస్, గంజిపేట్ శంకర్, ఎం.ఏ ఇసాక్,డి ఆర్ శ్రీధర్, అచ్చన్న గౌడ్, మోహన్ రావు, ఖలీమ్ బాలకృష్ణ, రేపల్లె కృష్ణ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు.
Also Read: Thummala Nageswara Rao: రైతుల సంక్షేమం కోసం నాబార్డు పని చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సమర్థవంతంగా బాధ్యతలు
గత నెల క్రితం ఏఐసీసీ పరిశీలకుడు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి జిల్లాలో పర్యటించి ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు గద్వాల శాంతినగర్ ఐజలో కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించారు ముఖ్య నేతలతో సమావేశమై అధ్యక్ష పదవికి ఎవరైతే సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆరా తీశారు. అంతేకాక దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి అధ్యక్ష పదవి ఎందుకు ఆశిస్తున్నారు. పదవి వస్తే పార్టీని మరింత ఎలా బలోపేతం చేస్తారు అనే అంశాలపై సమీక్షించారు అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రులతో వారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఏఐసీసీ నివేదించారనే చర్చి నడుస్తోంది దరఖాస్తులు అన్నింటిని వడపోసి పార్టీకి చాలా కాలంగా విధేయులుగా ఉన్న వారిలో సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న పలువురి పేర్లను ప్రతిపాదించారు.చివరికి ఇందులో నలుగురు పేర్లతో జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది
సామాజిక సమీకరణాలు
డిసిసి అధ్యక్ష పదవి ఇప్పటివరకు ఏ సామాజిక వర్గానికి దక్కింది పార్టీలో సీనియర్లుగా ఉన్న ఏ సామాజిక వర్గానికి పదవి దక్కలేదని అంశాలను ఏఐసిసి పరిశీలకుడు నారాయణస్వామి ఆరా తీసినట్లు సమాచారం. ఈ మేరకు వెల్లడైన వివరాల ఆధారంగా దరఖాస్తుదారులు ఏ సామాజిక వర్గానికి డిసిసి పదవి ఇస్తే మంచిదనే అంశాన్ని చర్చించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ డిసిసి అధ్యక్షుల ఎంపికలో వారి అభిప్రాయం కూడా కీలకంగా భావిస్తోంది. రాజు రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్లో ఉండడం, తిరుపతయ్యకు పార్టీలో ఐదేళ్లు పనిచేసిన అనుభవం లేకపోవడం,మొదటినుంచి ఎం.సీ నల్లారెడ్డికి జిల్లా అధ్యక్ష పదవిపించేందుకు సంపత్ సానుకూలంగా ఉన్నారు.
పదవి ప్రతిష్టాత్మకం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో డిసిసి అధ్యక్ష పదవి దక్కించుకోవడం ఆశావాహులకు ప్రతిష్టాత్మకమైనది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీఎం,ఇద్దరు మంత్రులు ఉండడంతో పదవి ఎవరికి దక్కుతుందోనని హాట్ ట్రాఫిక్ గా మారింది. ఒక్కసారి ఎంపిక అయితే ఐదేళ్లు పార్టీ సారథిగా ఉండే అవకాశం ఉంది. మంత్రులు ఎంపీ, ఇతర నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ లో పార్టీ ముఖ్య నేతలు, క్యాడర్ ను సమన్వయం చేసుకొని కొనసాగే పదవి కావడంతో ఎవరికివారు తమ ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాల అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ బీహార్ రాష్ట్ర ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ శ్రేణులు బిజీగా ఉండడంతో ఎన్నికలు పూర్తయ్యాక డిసిసి అధ్యక్షుల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: Jubliee Hills Bypoll: ప్రచారంలో సీతక్క దూకుడు.. బైక్ ఎక్కి గల్లీల్లో పర్యటన.. కేడర్‌లో ఫుల్ జోష్!
