Rachakonda Commissioner(image CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Rachakonda Commissioner: పండుగలకు పటిష్ట బందోబస్తు.. రాచకొండ సీపీ కీలక అదేశాలు!

Rachakonda Commissioner: వినాయక చవితి, మిలాద్ ఉల్ నబీ పండుగలు ఒకే సమయంలో జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Sudheer Babu) శాంతిభద్రతల కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.  రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. గత ఏడాది రాచకొండ పరిధిలో 13,472 వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించగా, ఈ ఏడాది ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.

 Also Read: Ponguleti on Harish Rao: తెలంగాణలో ఆసక్తికర ఘటన.. హ‌రీష్‌రావు ఫొటోకు మంత్రి ఫన్నీ క్యాప్ష‌న్‌!

డీజేలకు అనుమతి లేదు

నిర్వాహకులు మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తాత్కాలిక మడుగుల్లో నిమజ్జనం చేయాలని సూచించారు. మంటపాల ఏర్పాటులో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్లపై తోరణాలు, స్టేజీలు ఏర్పాటు చేయరాదని ఆదేశించారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తిగీతాలతో స్పీకర్లను ఉపయోగించాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జన ఊరేగింపుల కోసం హెచ్‌ఎండీఏ, జీహెచ్ఎంసీ,(GHMC) మున్సిపాలిటీలు, రోడ్లు, భవనాల శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేస్తాయని, చెరువుల వద్ద పర్యాటక శాఖ బోట్లను సిద్ధం చేస్తుందని తెలిపారు. 108 అంబులెన్సులు, వైద్య బృంద, ఫైర్ ఇంజన్లను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారని చెప్పారు. ప్రజల సహకారంతో వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

 Also Read: Medchal Town: స్తంభాలపై కేబుల్ వైర్ల తొలగింపు.. నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!