Ponguleti on Harish Rao: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం (World photography day) సందర్భంగా తెలంగాణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం సమాచార పౌరసంబంధాల శాఖ హైదరాబాద్‌లో ఫొటో ఎగ్జిబిషన్ (Photo exhibition 2025) నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)ని ఓ ఫొటో విపరీతంగా ఆకర్షించింది. ఆఫోటో ఎవరిదోకాదు.. ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి హరీష్‌రావుది కావడం గమనార్హం.
Also Read: CM Revanth Reddy: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు కార్పొరేట్ లుక్.. 20న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఓ సందర్భంలో వ్యక్తం చేసిన హావభావాలను హైదరాబాద్‌కు చెందిన కె. దుర్గా నరసింహారావు అనే ఫోటోగ్రాఫర్ ఒడిసిపట్టారు. సరిగ్గా అదే సమయంలో కెమెరాను క్లిక్ మనిపించి ఫోటోను ఎగ్జిబిషన్ పోటీలకు పంపించి ప్రత్యేక కన్సోలేషన్ బహుమతి పట్టేశారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న సమయంలో ఆ ఫోటో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మరీ ఎక్కువగా ఆకర్షించింది. అందుకే ఆయన తన ప్రసంగంలో ఈ ఫోటో గురించి ప్రస్తావిస్తూ ఆ ఫోటోకు తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: KTR on Congress: సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
‘ఇంకేముంది.. అంతా అయిపోయింది’ అంటూ హరీష్‌రావు హావభావాలకు మంత్రి పొంగులేటి తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం హరీశ్ రావులో నెలకొన్న నైరాశ్యాన్ని ఈ ఫోటో ప్రపంచానికి పరిచయం చేసిందని పొంగులేటి వ్యాఖ్యానించారు. కాగా సాక్షాత్తూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి కళ్లను ఆకర్షించిన కెమెరామెన్ పనితనాన్ని చూసి ఎగ్జిబిషన్ కు వచ్చినవారంతా ప్రశంసిస్తున్నారు.