Medchal Town(Image credit: swetcah reporter)
హైదరాబాద్

Medchal Town: స్తంభాలపై కేబుల్ వైర్ల తొలగింపు.. నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

Medchal Town: విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేటు సంస్థల కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు  తొలగించారు. ఇటీవల రామంతపూర్‌(Ramanthapur)లో జరిగిన ఘటన నేపథ్యంలో, అనధికారిక వైర్లను తొలగించేందుకు విద్యుత్ శాఖ ఈ చర్యలు చేపట్టింది. మేడ్చల్(Medchal) పట్టణంలోని వీధుల్లో, కాలనీల్లోని స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్ల గుంపులను తొలగించారు.

 Also Read: Tollywood: టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ పవర్ స్టార్ పవనేష్.. ఫొటో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

వినియోగదారులు సహకరించాలి

ఈ చర్యల కారణంగా పట్టణంలో కేబుల్(Cable) ద్వారా అందించే ఇంటర్నెట్ సేవలు, టీవీ ఛానల్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేబుల్ ఆపరేటర్లు, అధికారులు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైర్లను తొలగించారని మండిపడ్డారు. విద్యుత్ శాఖ చర్యల వల్ల మేడ్చల్ పట్టణంలో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో మేడ్చల్(Medchal) కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్  కేబుల్, ఇంటర్నెట్(Internet) సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

 Also Read: Mahatma Gandhi NREGA Scheme: గుడ్ న్యూస్.. మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్ప‌న ప‌నులు?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!