salaar movie Rumors Checked Photo
Cinema

Movie Updates: రూమర్స్‌కి చెక్‌ పెట్టిన ఫొటో

Salaar Movie Rumors Checked Photo: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్‍, ప్రభాస్ సూపర్ పర్ఫార్మెన్స్‌తో సలార్ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించింది. క్లైమాక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉండటంతో సలార్ 2పై మరింత ఇంట్రెస్ట్‌ నెలకొంది. సలార్ 2 మూవీ రద్దు అయిందని రూమర్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సలార్ టీమ్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.

హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నవ్వుతున్న ఫొటోలను ట్వీట్ చేసింది. వాళ్లు నవ్వు ఆపలేకపోతున్నారు అని రాసుకొచ్చింది.ఈ ఫొటోతో రూమర్లకు సలార్ టీమ్ దాదాపు చెక్ పెట్టేసింది. సలార్ 2 క్యాన్సిల్ అయిందన్న రూమర్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఇన్‍డైరెక్ట్‌గా ఈ ఫొటోతో రిప్లై ఇచ్చినట్లయ్యింది. ఈ మూవీ గురించి ప్రశాంత్ నీల్ కూడా ఇటీవలే హింట్ ఇచ్చారు. సలార్ 2 సినిమానే తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ చెప్పారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని అన్నారు.

Also Read: ‘చిల్లర్’ బిజినెస్

ప్రభాస్ ఇతర సినిమాల్లో బిజీగా ఉన్న తరుణంలో ఆయన లేని సీన్లను ప్రశాంత్ ముందుగా చిత్రీకరిస్తారని టాక్. కల్కి 2898 ఏడీ ప్రమోషన్లు అయిపోయాక సలార్ 2 షూటింగ్‍కు ప్రభాస్ వస్తారనే అంచనాలు వచ్చాయి.అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ గురించి ఇటీవలే అప్‍డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ కానుందని వెల్లడైంది. దీంతో సలార్ 2 రద్దయిందనే రూమర్లు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని సలార్ 2 ఉంటుందనేలా తేల్చి చెప్పేసింది మూవీ టీమ్.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!