Bollywood heroine Manushi Chillar starts swimming suits business :
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో టాలీవుడ్ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో సస్సెస్ కాలేకపోయింది. అలాగని బాలీవుడ్ లోనూ పెద్దగా చెప్పుకోదగిన పేరు సంపాదించుకోలేదు. ఆమె ప్రయత్నాలు ఏవీ కూడా సక్సెస్ కాలేదు. అయితే చాలా మంది కథానాయికలు దీపం ఉండగానే ఇంటిని చక్కపెట్టుకోవాలనుకుంటున్నారు. సినిమాలలో వచ్చిన పేరును కాపాడుకుంటూ సొంతంగా వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. సోనమ్ కపూర్, సమంత, నేహా శర్మ లాంటి భామలు ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో ఉన్నారు. ఇక కత్రిన, నయనతార, సన్నీలియోన్, తాప్సీ లాంటి నటీమణులు సొంత బ్రాండ్ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలో మునిగి తేల్తున్నారు. అయితే వీళ్లందరి కంటే భిన్నంగా ఈ బ్యూటీ ఓ స్విమ్ వేర్ బ్రాండ్ ల వ్యాపారంలోకి దిగింది.
బికినీ డ్రెస్సల బిజినెస్
మా దుకాణంలో బికినీలు, స్విమ్ సూట్లు అమ్మబడును!! అంటూ బోర్డ్ పెట్టుకుంది. ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తాను నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లే కావడంతో ఎంతో డీలా పడిపోయింది. అందుకే మానుషి ఫ్యాషన్ ప్రపంచంలో లాభ సాటి వ్యాపారాల వైపు దృష్టి సారిస్తోందని తెలిసింది. ఇప్పుడు ఒక వ్యవస్థాపకురాలిగా మారుతోంది మాజీ మిస్ వరల్డ్ మానుషి స్విమ్ బ్రాండ్ ‘డ్వీప్’ను ప్రారంభించింది. ఇటీవల ఇంటర్నెట్‌లో వేడెక్కించే బికినీ- స్విమ్ సూట్లతో కనిపించింది మానుషి. తన బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూనే ఒక చేతికి బ్రాస్‌లెట్ ధరించి కనిపించింది. రకరకాల రంగుల్లో ఉన్న బికినీలను మానుషి ధరించింది. తాజాగా మానుషి షేర్ చేసిన వీడియో క్లిప్ లో ఒక నియాన్ బికినీ.. రెడ్ హాట్ బికినీలో మతులు చెడగొట్టింది. మానుషి నిజానికి ఈ ఫోటోషూట్లో ఒక మోడల్‌ను తలపించింది. ఎత్తుగా కనిపించే హిప్ నడుముకి జత చేసిన రీఫ్ రఫ్ఫిల్ బికినీ టాప్.. పసుపు మోనోకిని ఫ్రంట్ ఎండ్ జిప్‌తో వెరీ స్పెషల్ గా కనిపించింది. ఈ బికినీలు, ఈత దుస్తుల ధరలు.. ఇతర ఉత్పత్తులైన ట్రావెల్ యాక్సెసరీస్, కో-ఆర్డు సెట, ప్యాంటు, మాక్సి డ్రెస్ వంటి వాటి ధరలు రూ.1099 నుండి 11,999 వరకూ ప్రారంభ ధరలు ఉంటాయంటున్నారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం దిశా పటానీ ‘టెహ్రాన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ‘బడే మియాన్ చోటే మియాన్’లో అలయ ఎఫ్, సోనాక్షి సిన్హాతో పాటు మానుషి ఒక కీలక పాత్రలో కనిపించింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటించారు.