Thai Princess: రెండేళ్లుగా బెడ్ పైనే ప్రిన్సెస్.. స్పందించిన ప్యాలెస్
Thai Princess (Image Source: Twitter)
అంతర్జాతీయం

Thai Princess: రెండేళ్లుగా బెడ్ పైనే ప్రిన్సెస్.. రాజ భవనం నుంచి షాకింగ్ ప్రకటన

Thai Princess: గత రెండేళ్లుగా బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉన్న థాయ్ రాజు పెద్ద కుమార్తె గురించి రాజ భవనం షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఆమె తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపింది. 2022లో ఓ పబ్లిక్ ఈవెంట్ లో థాయ్ రాకుమారి బజ్రకిటియాభ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు సంబంధించి రాజ భవనం చేసిన తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం.

2022లో కుప్పకూలిన ప్రిన్సెస్
థాయ్ యువరాణి బజ్రకిటియాభ మహిడోల్‌ (Bajrakitiyabha Mahidol).. 2022 డిసెంబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చివరిసారిగా బాహ్య ప్రపంచానికి కనిపించారు. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ (Capital Bangkok)కు ఉత్తరంగా ఉన్న నఖోన్‌ రాచసీమా  (Nakhon Ratchasima)లో జరిగిన సైనిక కుక్కల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండె సంబంధిత సమస్య తలెత్తి ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి ప్రిన్సెస్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఆగస్టు 9న రక్తంలో ఇన్ ఫెక్షన్ గుర్తింపు
అయితే తాజాగా రాయల్‌ హౌస్‌హోల్డ్‌ బ్యూరో (Bureau of the Royal Household) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఆ రోజు తలెత్తిన సమస్య.. ప్రిన్సెస్‌ ఆరోగ్యంపై రెండేళ్లకు పైగా ప్రభావం చూపింది. ‘ప్రిన్సెస్‌ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు.. వైద్య పరికరాలు, మందుల సహాయంతోనే పనిచేస్తున్నాయి’ అని తాజా ప్రకటనలో రాజ కుటుంబం స్పష్టం చేసింది. ‘2025 ఆగస్టు 9న ఆమె రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. అప్పటి నుండి యాంటీబయోటిక్స్‌తో పాటు రక్తపోటు స్థిరంగా ఉండేలా వైద్యులు మందులు ఇవ్వడం ప్రారంభించారు’ అని పేర్కొంది. ప్రిన్సెస్ బజ్రకిటియాభ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది.

ప్రిన్సెస్ విషయానికి వస్తే..
థాయిలాండ్ లోని ప్రముఖ వ్యక్తుల్లో ప్రిన్సెస్ బజ్రకిటియాభ (46) ఒకరు. ఆమె రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌ (Maha Vajiralongkorn) కు పెద్ద కుమార్తె. ఆయన మొదటి భార్యకు పుట్టిన ఏకైక సంతానం ఈమెనే. బ్రిటన్‌, అమెరికా, థాయ్‌లాండ్‌లలో విద్యనభ్యసించిన బజ్రకిటియాభ.. ఐక్యరాజ్యసమితి (United Nations)లో పలు పదవులు చేపట్టారు. జైళ్లలో మహిళా ఖైదీలకు మెరుగైన సదుపాయాల కోసం ఆమె ప్రచారం చేశారు. తన తండ్రికి అత్యంత సన్నిహితురాలిగా ఉంటూ వచ్చిన ఆమె ఆసుపత్రిలో చేరే ఏడాది ముందు వరకూ కూడా రాజు బాడీగార్డ్‌ కమాండ్‌లో ఉన్నత పదవిలో ఉన్నారు.

Also Read: BJP MLAs Arguments: అసెంబ్లీలో గొడవ పడ్డ అధికార ఎమ్మెల్యేలు.. నచ్చజెప్పిన విపక్ష సభ్యులు!

రాజుకి 4 పెళ్లిళ్లు.. ఏడుగురు సంతానం
థాయ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌ (73) ఇప్పటివరకూ నాలుగు వివాహాలు చేసుకున్నారు. అతడికి ఏడు మంది సంతానం ఉన్నా.. ఇప్పటివరకూ తన వారుసుడు/వారసురాలు ఎవరో ప్రకటించలేదు. అయితే థాయ్ వారసత్వ చట్టాల ప్రకారం పురుషులకే అధిక ప్రాధాన్యం ఉంది. మరోవైపు థాయి కుటుంబంపై చేసే ప్రకటనలపై ఆ దేశంలో కఠిన ఆంక్షలు ఉన్నాయి. రాజ కుటుంబాన్ని విమర్శించడం, దూషించడం వంటివి చేస్తే ఒక్కో ఆరోపణపై 15 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.

Also Read This: Modi Employment scheme: ప్రధాని గుడ్ న్యూస్.. యూత్ కోసం రూ. లక్ష కోట్లతో కొత్త పథకం.. వివరాలు ఇవే!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..