BJP MLAs Arguments (Image Source: Twittter)
Viral

BJP MLAs Arguments: అసెంబ్లీలో గొడవ పడ్డ అధికార ఎమ్మెల్యేలు.. నచ్చజెప్పిన విపక్ష సభ్యులు!

BJP MLAs Arguments: ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ (Uttar Pradesh Assembly)లో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో వివాదం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభలోనే బాహా బాహీకి దిగారు. వారి ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అధికార, విపక్ష సభ్యులు వారి మధ్య కలుగజేసుకొని ఇద్దరికి సర్దిచెప్పడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని మథురకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజేష్‌ చౌదరి (Rajesh Chaudhary), వారణాసి ఎమ్మెల్యే సౌరభ్‌ శ్రీవాస్తవా (Saurabh Srivastava) మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది. ‘విజన్‌ 2047’ (Vision 2047)పై జరిగిన చర్చ సందర్భంగా వారిద్దరు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీలో ఉన్న ఇతర సభ్యులు ఈ పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. నిల్చొని ఉన్న చౌదరిని.. రెండు వరుసల ముందు కూర్చున్న శ్రీవాస్తవా వైపు వెళ్లకుండా వారు అడ్డుకోవడం వీడియోలో చూడవచ్చు.

Also Read: PM Modi – GST: ఎర్రకోట వేదికగా ప్రధాని బంపరాఫర్.. ఇక అందరి ఖర్చులు తగ్గబోతున్నాయ్!

మాజీ సీఎం విమర్శలు
అయితే ఈ వాగ్వాదం.. అధికార పార్టీ తరపున ఎవరు మాట్లాడాలి అనే విషయంలో తలెత్తినట్లు తెలుస్తోంది. వారణాసి ఎమ్మెల్యే సౌరభ్ తన పేరును స్పీకర్ కు పంపలేదని చౌదరి ఆరోపించినట్లు సమాచారం. సమాజివాది పార్టీ (Samajwadi Party) అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) వాగ్వాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసభ్య ప్రవర్తన, అశ్లీ, భాషను వాడే వారిని బీజేపీ ప్రోత్సహిస్తోంది’ అంటూ విమర్శలు గుప్పించారు.

Also Read: CM Revanth Reddy: ఏపీతో జల వివాదం.. గోల్కొండ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

ఇదేం కొత్త కాదు.. గతంలోనూ!
అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు గొడవపడటం ఇదేం తొలిసారి కాదు. దేశంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. 2015 అక్టోబర్ లో బీఫ్ నిషేధం విషయమై బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు విపక్ష సభ్యులపై దాడికి సైతం పాల్పడ్డారు. యూపీలో 2017 అక్టోబర్ లో సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ తలెత్తింది. స్థానిక స్వపరిపాలన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చర్చ సందర్భంగా ఇరు పార్టీల నేతలు భౌతిక దాడులకు దిగారు. 2019 జులైలో బెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఘర్షణ జరిగింది. రాజకీయ హింసపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

Also Read: Modi Employment scheme: ప్రధాని గుడ్ న్యూస్.. యూత్ కోసం రూ. లక్ష కోట్లతో కొత్త పథకం.. వివరాలు ఇవే!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?