Social Service Organisations (IMAGE credit: twitter)
నార్త్ తెలంగాణ

Social Service Organisations: గతంలో గుర్తింపు ప్రోత్సాహకాలు.. మరి ఇప్పుడు ఏది..?

Social Service Organisations: అధికారిక రిజిస్ట్రేషన్ ఉన్న లయన్స్ క్లబ్,(Lions Club) రోటరీ క్లబ్,(Rotary Club) వాసవి క్లబ్(Vasavi Club) ల ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థ లు నిరుపేదలు, విద్యార్థులు, ఆపత్కాలంలో బిక్కుబిక్కుమంటూ గడిపే వారికి మేమున్నామంటూ సేవలందిస్తుంటారు. స్వతహాగా సేవ చేసిన జిల్లా అధికారులు గుర్తింపు ఇవ్వరా..? అంటూ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, వివిధ రకాల క్లబ్బుల పేరుట సామాజిక కార్యక్రమాలు అందించే వారు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అనాధలకు, కడుపున పుట్టిన బిడ్డలే పట్టించుకోని వారికి సేవలందించే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుల సామాజిక కార్యక్రమాలు అధికారులకు పట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, అసైన్డ్, సొసైటీ భూములు అన్యాక్రాంతమవుతుంటే వాటిపై కథనాలు ప్రచురించిన జర్నలిస్టులను గుర్తించడంలోనూ జిల్లా అధికారులు వైఫల్యం చెందుతున్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

గతంలో గుర్తింపు ప్రోత్సాహకాలు.. మరి ఇప్పుడేది..?
గతంలో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్బులతోపాటు మరికొన్ని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు చేసిన సేవలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో గుర్తించి వారికి ప్రశంసా పత్రాలతో ప్రోత్సాహకాలను అందించేవారు. గత రెండేళ్లుగా ఈ కార్యక్రమాలకు అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను పట్టించుకోవడంలేదని ఆవేదనను వెల్లడిస్తున్నారు. నిత్యం జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిర్వహించే సమీక్షలు, సమావేశాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి వార్తలను ప్రచురించే వారిపైన ఎందుకింత నిర్లక్ష్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యమా… ఏవో అలసత్వమా..?
మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో ప్రధానంగా లయన్స్ క్లబ్,,(Lions Club) రోటరీ క్లబ్,,(Rotary Club) వాసవి క్లబ్(Vasavi Club) ల ద్వారా ఏడాది పాటున నిత్యం ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఆపద సమయంలో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సమయం కేటాయించి మరి అండగా నిలుస్తుంటారు. గత రెండేళ్లుగా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను పట్టించుకోవడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. అయితే ఈ నిర్లక్ష్యానికి కలెక్టరేట్ పరిపాలన అధికారి అలసత్వమా..? లేదంటే అధికారుల నిర్లక్ష్యమా.. ? అనే చర్చ సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన ఉత్తమ విధులు చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

విధుల నిర్వహణకు నెలవారి వేతనం పొందుతున్న వారికే ప్రోత్సాహకాలు ఇస్తే… స్వచ్ఛందంగా తామున్నామంటూ ప్రజలకు, అనాధలకు సేవలందించే వారిని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్ కింద కూర్చొని లక్షల జీతాలు పొందుతూ విధులు నిర్వహించే వారికి అందలమెక్కిస్తే ప్రజాసేవ చేసే వారికి ఎందుకు గుర్తింపు ఇవ్వరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సాహించి, అభినందించాల్సిన అధికారులే గుర్తించకపోతే సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు ఎలా ముందుకు సాగుతారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా ఆ అధికారి వచ్చిన నాటి నుంచే ఈ దుస్థితి ఏర్పడుతుందని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, వివిధ క్లబ్బుల బాధ్యులు వెల్లడిస్తున్నారు.

 Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!