Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: రౌండ్ ది క్లాక్ విధుల్లో 3565 మంది.. ఎప్పటికప్పుడు హైడ్రా చర్యలు

Hydraa: హైదరాబాద్ మహానగరానికి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ కావటంతో హైడ్రా(Hydraa) అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. హైడ్రాకు చెందిన సుమారు 3565 మంది వివిధ క్యాటగిరీలకు చెందిన సిబ్బంది రౌండ్ ది క్లాక్(Round The Clock) అప్రమత్తంగా ఉన్నట్లు, అవసరమైన సేవలను అందిస్తున్నట్లు హైడ్రా వెల్లడించింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను స్వీకరించిన వెంటనే ఎక్కడా రహదారులపై నీరు నిల్వగుండా ఎప్పటికప్పుడు క్యాచ్ పిట్లలో, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా హైడ్రా బృందాలు పని చేస్తున్నాయని వెల్లడించింది. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని హైడ్రా గుర్తించిందని, ఇందులో 150 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అక్కడ నీటిని తోడేసేందుకు హెవీ మోటార్లు(Heavy Moters) పెట్టడమే గాక, వరద సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లను చేసినట్లు హైడ్రా వెల్లడించింది.

మరో 142 ప్రాంతాల్లో కూడా ఇవే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. కొద్దిపాటి సమస్య ఉండే ప్రాంతాలను 144గా గుర్తించి, అక్కడ వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. హైడ్రా డీఆర్ఎఫ్(DRDF) బృందాలు 51 రంగంలో ఉండగా, మాన్సూన్ ఎమర్జన్సీ(MOON SOON) టీమ్ లు 150 పని చేస్తున్నాయని, ఈ రకంగా మొత్తం 3565 మంది విధుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలిపింది. వీటికి తోడు 9 బోట్లను సిద్ధం చేసుకుని, సమస్యాత్మక ప్రాంతాలకు వాటిని చేరవేసినట్లు హైడ్రా పేర్కొంది.

Also Read: Bhadradri kothagudem: దూర ప్రయాణాలు చేసేవారు బీ కేర్ ఫుల్.. అవి మర్చిపోకండి?

309 ప్రాంతాల్లో నిత్యం నిఘా

నగరంలో 309 ప్రాంతాల్లో హైడ్రా నిత్యం నిఘా పెట్టి, పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. వర్షం వస్తున్నప్పుడు వరదను అంచనా వేసి, మ్యాన్ హోళ్లను తెరవడం, తర్వాత మూసేయడం, క్యాచ్ పిట్ల వద్ద చెత్తను నిరంతరం తీయడం వంటి విధులో హైడ్రా(Hydraa) సిబ్బంది నిమగ్నమై ఉన్నట్లు వెల్లడించింది. వీరికి తోడు 20 బృందాలు నిత్యం ట్రాఫిక్ పోలీసుల(Traffic Police)తో ఉంటూ, వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రతలు తీసుకుంటున్నట్లు, ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాల్లో క్లియర్ చేయటంలో హైడ్రాకు సహకరిస్తున్నట్లు తెలిపింది.

చెట్లు పడిపోతే వెంటనే తొలగించేందుకు ప్రత్యేకంగా ఉన్న బృందాలకు తోడు, ట్రాఫిక్ భారీగా జామ్ అయినపుడు సులభంగా వెళ్లేందుకు 21 బైకు బృందాలు కూడా ఫీల్డులో ఉన్నట్లు హైడ్రా వెల్లడించింది. 212 డీవాటరింగ్ పంపులను నీరు నిలిచే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఐఎండీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ(Telangana Development Planning Society), మూడు పోలీసు కమిషనరేట్లతో పాటు జీహెచ్ఎంసీ(GHMC), ఫైర్ కంట్రోల్ రూమ్(Fire Controle Room) లలో హైడ్రా సిబ్బంది ఉంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను హైడ్రా కంట్రోల్ రూమ్ కు సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హైడ్రా పేర్కొంది.

Also Read: Danish Zoo: ‘మీ పెంపుడు జంతువులు ఇవ్వండి.. జూలో జంతువులకు వేస్తాం’

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?