Bhadradri kothagudem: దూర ప్రయాణాలు చేసేవారు బీ కేర్ ఫుల్
Bhadradri kothagudem (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Bhadradri kothagudem: దూర ప్రయాణాలు చేసేవారు బీ కేర్ ఫుల్.. అవి మర్చిపోకండి?

Bhadradri kothagudem: వరుసగా సెలవులు రావడంతో చాలా మంది దూర ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు((SP Rohith Raju) తెలిపారు. ఈ నెల 15,16 మరియు 17 తారీఖులలో వరుస సెలవుల దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా మన జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని వెల్లడించారు.

తాళం వేసి ఉన్న ఇండ్లలో

ఈ దొంగల ముఠా తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసు శాఖ తరపున రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పలు సూచనలు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇండ్ల పరిసర ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం మంచిదన్నారు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని సూచించారు.

Also Read: Jangaon Crime: జనగామ జిల్లాలో ఘోరం.. తల్లి కూతురు దారుణ హత్య!

కాలనీల్లో దొంగతనాల నివారణకు

ఇంట్లో బంగారు నగలు(Gold),నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం అన్నారు. ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లాలి. బ్యాగుల్లో బంగారు నగలు, డబ్బు(Money) పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు తమ దగ్గరే పెట్టుకోవాలని సూచించారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమని తెలిపారు. ఇండ్లలో, కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా మన జిల్లాలోని సింగరేణి, KTPS, నవభారత్, ITC, BTPS మరియు ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగుల నివాస కాలనీలలో, గేటెడ్ కమ్యూనిటీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై జిల్లా కమాండ్ కొంట్రోల్ నంబరు 8712682128 కు, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

Also Read: Hanumakonda District: హనుమకొండ జిల్లా వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో విచిత్ర పరిస్థితి

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..