Jangaon Crime (iagecredit:swetcha)
క్రైమ్

Jangaon Crime: జనగామ జిల్లాలో ఘోరం.. తల్లి కూతురు దారుణ హత్య!

Jangaon Crime: తల్లి కూతుర్లను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన జనగామ జిల్లా జఫర్ గడ్ మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో చోటు చేసుకుంది. జరిగిన ఈ సంఘ‌ట‌నతో జ‌న‌గామ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది, అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివ‌రాలిలా ఉన్నాయి. జిల్లాలోని జ‌ఫ‌ర్‌గ‌డ్(Jafargarh) మండ‌లం తమ్మ‌డిప‌ల్లి (ఐ)లో ఒంట‌రి మ‌హిళ అయిన గాలి రాణమ్మ(Ranamma) (50)తో ఆమె త‌ల్లి తుమ్మ అన్న‌మ్మ(Annamma) (80) క‌లిసి నివ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలో గురువారం రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వీరిని హ‌త్య చేసి పారిపోయారు. దీంతో శుక్ర‌వారం ఉద‌యం స్థానికులు గుర్తించి పోలీసుల‌(Police)కు జరిగిన స‌మాచారం అందించారు. క్లూస్ టీం ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని పోలీసులు ప‌రిశీలించారు.

ఈ సంగటనపై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, బంగారం(Gold) కోసం దొంగ‌లు హ‌త్య చేశారా? లేదా ఆస్తి(Property) త‌గాదాల‌తో ఎవరైనా ఈ హ‌త్య జ‌రిగిందా అని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ జాగిలాల్తో కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు మహిళలు ఓకేసారి హత్య జరగడంతో గ్రామంలో ఓక్కసారిగా స్ధానికులు భయాందోళనకు గురయ్యారు.

Also Read: Telangana PCB: ఆ శాఖలో అధికారులదే పెత్తనం.. మంత్రిని సైతం లెక్క చేయని వైనం..!

అతి క్రూరంగా హత్య

ప్రస్ధుతం వివాహేతర సంబంధాల కారణంగా భర్తలను భార్యలు అతి క్రూరంగా హత్య చేస్తున్నారు. మహారాష్ట్ర నలసోపర ప్రాంతంలో కోమల్ చవాన్ అనే మహిళ తన ప్రియుడు మోనుతో కలిసి తన భర్త విజయ్ చవాన్‌ను హత్య చేసింది. హైదరాబాద్ కుత్బుల్లా పూర్‌లో గత నెల జ్యోతి అనే మహిళ తన భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి పథకం వేసింది. వారు రాందాస్‌ను బౌరంపేటకు తీసుకెళ్లి, మద్యం తాగించి, బీరు బాటిళ్లతో దాడి చేసి హత్య చేశారు.

ఈ నెలలో కరీంనగర్ కు చెందిన రమాదేవి అనే మహిళ తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. యూట్యూబ్‌లో చూసిన వీడియో ఆధారంగా, భర్తకు మద్యం తాగించి, చెవిలో పురుగుల మందు పోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో జయశ్రీ అనే మహిళ తన భర్త వెంకటేష్‌ ప్రాణాలు తీసింది. మేఘలయ హనీమూన్ ఘటనలో సోనమ్ రఘువంశీ అనే మహిళ.. తన ప్రియుడు సుపారీ గ్యాంగ్ తో భర్తను అతిదారుణంగా హత్య చేసింది.

Also Read: Bun Butter Jam Trailer: ‘బ‌న్ బ‌ట‌ర్ జామ్‌’ ట్రైలర్.. అందరూ చూడాల్సిందే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!