Hyderabad Rains: హైదరాబాద్ లో నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను జోన్ల వారిగా విభజిస్తూ.. ఏ తేదీల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వివరించింది. ఆయా ప్రాంతాల్లో 13, 14 తేదీల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని.. 15,16 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ తర్వాత రెండ్రోజులు నగరంలోని ఆయా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడింది. ఇంతకీ భారత వాతారణం కేంద్రం పేర్కొన్న ప్రాంతాలు ఏవి? అక్కడ ఏ స్థాయిలో వర్షం కురవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టు 13, 14 తేదీల్లో..
హైదరాబాద్ లోని చార్మినార్, ఖైరతాబాద్, కుకట్ పల్లీ, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగం పల్లి జోన్లలో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జోన్లలోని ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది. కాబట్టి ఆ జోన్లలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఆగస్టు 15, 16 తేదీల్లో
పైన పేర్కొన్న జోన్లలో 15, 16 తేదీల్లో భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశముందని అంచనా వేసింది. కాబట్టి నగర వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: Dating With AI: 5 నెలలుగా ఏఐతో డేటింగ్.. నిశ్చితార్థం కూడా జరిగింది.. యువతి షాకింగ్ ప్రకటన!
ఆగస్టు 17వ తేదీ..
ఆ రోజున నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తాజా ప్రకటనలో తెలిపింది. చార్మినార్, ఖైరతాబాద్, కుకట్ పల్లీ, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగం పల్లి జోన్లలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురవొచ్చని వివరించింది.
Also Read: Stray Dogs Row: సుప్రీంకోర్టు బయట కుక్కల పంచాయితీ.. డాగ్ లవర్ చెంప చెల్లుమనిపించిన లాయర్!
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలే..
హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. వచ్చే నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని పశ్చిమ, సెంట్రల్ జిల్లాల్లో ఆగస్టు 14, 15 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ఏరియాల్లో 150-200మి.మీ వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది.