Viral Video (Image Source: Insta Video)
Viral

Viral Video: మహా అద్భుతం.. గంటలో హీరోగా మారిపోయిన ఆటోవాలా.. వీడియో వైరల్!

Viral Video: ఒక ఆటో డ్రైవర్ ను సినీ హీరోగా మేకోవర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ లోకంలో ప్రతీ ఒక్కరూ అందగారేనని.. అయితే వారి వద్ద ఉన్న డబ్బే వారి లుక్ ను డిసైడ్ చేస్తుందని పేర్కొంటున్నారు. ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది? ఆటో డ్రైవర్ లుక్ మార్చేందుకు ఏం చేశారు? ఇప్పుడు పరిశీలిద్దాం.

వీడియోలో ఏముందంటే?
ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఆటోవాలాకు సంబంధించిన మేకోవర్ వీడియోను షేర్ చేశారు. అందులో తొలుత డ్రైవర్ కు సంబంధించిన తన సాధారణ జీవితాన్ని చూపించారు. అనంతరం అతడికి మేకోవర్ చేయడం ప్రారంభించాడు. క్లాసిక్ ఆర్మీ సైడ్ పార్ట్ హెయిర్‌కట్ ఇచ్చి.. ఆటోవాలాకు మెరుగైన ఫార్మల్ లుక్ తీసుకొచ్చారు. తర్వాత డైమండ్ కట్ గైడ్‌లైన్‌తో అతని పొడవాటి గడ్డాన్ని ట్రిమ్ చేశారు. ముఖానికి ఉన్న టాన్ తొలగించడానికి యాంటీమైక్రోబియల్ లక్షణాలున్న పెరుగు, కసూరి మేతి మిశ్రమాన్ని ఉపయోగించాడు.

కోట్లల్లో వ్యూస్..
ఫేషియల్ టచ్ అయిపోయాక తిరిగి డ్రైవర్ జుట్టుపై ఫోకస్ పెట్టారు. విటమిన్ E మాత్రలతో జుట్టుకు బలాన్ని, షైనింగ్ తీసుకొచ్చారు. హెయిర్ స్టైల్ పూర్తయ్యాక.. శాండ్ కలర్ క్రింకిల్ టెక్స్చర్ షర్ట్, రిలాక్స్డ్ వైట్ స్లాక్స్ ప్యాంటును అతడిచేత ధరింప చేశారు. చివరగా ముఖానికి స్టైలిష్ గ్లాసెస్, చేతికి బ్రౌన్ వాచ్ పెట్టి అతడి లుక్ ను పూర్తిగా మార్చివేశారు. మెుదట ఉన్న ఆటో డ్రైవర్ లుక్ కు.. అతడ్ని మేకోవర్ చేసిన తర్వాత ఫొటోలతో మ్యాచ్ చేస్తూ వీడియోను ముగించారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by Karron S Dhinggra (@theformaledit)

Also Read: TG Rains: బిగ్ అలెర్ట్.. మరో 4 రోజులు దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త!

నెటిజన్ల రియాక్షన్
ఆటోవాలా మేకోవర్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొంతమంది ఈ-రిక్షా డ్రైవర్‌ను అంతర్జాతీయ మోడల్‌గా పేర్కొంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి రూపాన్ని మార్చిన ఇన్ ఫ్యూయెన్సర్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ‘క్రేజీ ట్రాన్స్ ఫర్మేషన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆటోవాలా నుంచి హాలీవుడ్ హీరోగా మారిపోయాడు’ అంటూ ఇంకొకరు ప్రశంసించారు. ‘వావ్! ఇది పూర్తిగా నమ్మశక్యం కాని మార్పు’ అని ఒకరు రాసుకొచ్చారు.

Also Read This: UP Maharajganj: కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో అశ్లీల వీడియోలు.. ఖంగుతిన్న అధికారులు! 

Also Read This: 12 Year-Old Girl Assaulted: దేశంలో అత్యంత ఘోరం.. 12 ఏళ్ల బాలికపై.. 200 మంది అత్యాచారం!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు