TG Rains (Image Source: AI)
తెలంగాణ

TG Rains: బిగ్ అలెర్ట్.. మరో 4 రోజులు దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త!

TG Rains: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోతగా వర్షం కురుస్తోంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో వాహనదారులు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి భారీగా చేరుతున్న నీటిని తొలగించేందుకు అటు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం పిడుగులాంటి సందేశాన్ని మోసుకొచ్చింది. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

కాసేపట్లో.. హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణం కేంద్రం స్పష్టం చేసింది. ఇవాళ సాయంత్రం వరకూ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. సాయంత్రం నుంచి రాత్రి మధ్య భారీ వర్షం కురవొచ్చని అంచనా వేసింది. ఆగస్టు 13 తేదీన కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది.

ఉద్యోగులకు కీలక ఆదేశాలు..
హైదరాబాద్ లో సాయంత్రం తర్వాత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Traffic Police) అప్రమత్తమయ్యారు. నగరంలోని ప్రముఖ కంపెనీలు, ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘నగరంలో భారీ వర్షం కురుస్తుందని అంచనాలు ఉన్నందున 3 గంటల లోపు ఉద్యోగులు తమ విధులను ముంగించుకోవాలి. సాయంత్రం షిఫ్టుల్లో పనిచేసేవారు మీ భద్రత దృష్ట్యా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి. అలా చేయండం ద్వారా ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడంతోపాటు అత్యవసర సేవలకు అంతరాయం కలిగించని వారు అవుతారు’ అని ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇవాళ, రేపు.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు
మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావం తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 12, 13 తేదీల మధ్య దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరదలు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. కొన్ని చోట్ల ఏకంగా 150-200మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని అభిప్రాయపడింది.

Also Read: Warangal Rains: భారీ వర్షానికి వరంగల్ అతలాకుతలం.. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ఆగస్టు 14, 15 తేదీల్లోనూ దంచుడే..!
తెలంగాణలోని పశ్చిమ, సెంట్రల్ జిల్లాల్లో ఆగస్టు 14, 15 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ఏరియాల్లో 150-200మి.మీ వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆగస్టు 14న భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. నగరంలోని కొన్ని ఏరియాల్లో 70-120మి.మీ వర్షపాతం రికార్డు కావొచ్చని పేర్కొంది. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో ఆగస్టు 15వ తేదీన ఇదే పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది.

Also Read This: UP Maharajganj: కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో అశ్లీల వీడియోలు.. ఖంగుతిన్న అధికారులు!

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు