Warangal Rains: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలతో వరంగల్ అతలాకుతలం అయింది. వరంగల్ (Warangal) ఉమ్మడి జిల్లాలో వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లో రహదారి కలవర్తులపై వరద ప్రవహిస్తుండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్ వరంగల్ (Warangal) లో రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, మధురానగర్, శివ నగర్, ఎన్టీఆర్ నగర్ వరద ముంపుకు గురిఅయ్యాయి. అప్రమత్తమైన వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కాలనీవాసులకు అధికారులు సూచనలు జారీ చేశారు భారీ వర్షం నేపథ్యంలో వరంగల్ (Warangal) మహానగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు నిత్యం వరద బాధిత ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
కాలనీలు జలమయం
అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం…
హనుమకొండ(Hanumakonda) లోని భవాని నగర్, చైతన్యపురి కాలనీ, అశోక్ నగర్, స్నేహా నగర్, వరంగల్ సాకారశి కుంట, ఏకశిలా నగర్,శివ నగర్ ఏరియాలు జలమయం అయ్యాయి. ఇండ్లలోకి వరదనీరు చేరి పూర్తిగా తడిసిన ఇంట్లోని వస్తువులు. పలు ప్రాంతాల్లో బయటకు కూడా రాలేని పరిస్థితి లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తభవనం డొల్లతనం
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడక ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరడంతో రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల 100 పడకల ఆసుపత్రి పైన నూతన బిల్డింగ్ నిర్మాణం చేపడుతుండడంతో ఆసుపత్రి పైన ఉన్న రేకులు తొలగించడంతో భారీ వర్షానికి నీరు మొత్తం మెట్ల మార్గం ద్వారా ఆసుపత్రిలోకి చేరి రోగుల బెడ్లు, ఓపి రూములకు వర్షపు నీరు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సిబ్బంది ద్వారా నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. వరద నీరు ఆస్పత్రిలో చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District)లొ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి..భూపాలపల్లి సింగరేణి ఉపరితలబొగ్గు గనుల్లోకి భారీగా వరదనీరు చేరింది. దింతో బొగ్గు ఉత్పత్తి కి, మట్టి వెలికితీతకు తీవ్ర ఆటంకం కలగడంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు.
పెద్ద ముప్పారానికి రాకపోకలు బంద్
మహబూబా జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి రాత్రి కురిసిన వర్షానికి పాలేరు వాగు ఉగ్రరూపం చూపడంతో రాకపోకలు నిలిచిపోయాయి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిడ్జికి శంకుస్థాపన చేసి సుమారు రెండు సంవత్సరాలైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
స్కూళ్లకు సెలవు.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల నర్సంపేట డివిజన్ లో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ. వర్షానికి పొంగిపొలుతున్న వాగులు వంకలు.ఈ భారీ వర్షానికి ఎవరు ఇండ్లలో నుండి బయటకి రావద్దనీ శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నుండి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షం కారణంగా స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది.
వరద ప్రాంతాల్లో అధికారులు
రాత్రి కురిసిన జారీ వర్షానికి వరంగల్ జిల్లా జిడబ్ల్యూ ఎంసీ పరిధిలోని జలమయమైన లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, ఎస్ ఆర్ నగర్, గిరి ప్రసాద్ కాలనీ,వివేకానంద కాలనీ, మధురానగర్, పద్మానగర్, డి కె నగర్ తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు అధైర్య పడవద్దని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతికూల పరిస్థితుల నేపద్యం లో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని, ఆహారంతో పాటు మెడిసిన్స్ సౌకర్యాలు కల్పించడం జరిగిందని స్థానికులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్, డిఎం హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డి ఎఫ్ ఓ శ్రీధర్ రెడ్డి, ఆర్డి ఓ సత్యపాల్ రెడ్డి, సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్, బల్దియా డిఎఫ్ ఓ శంకర్ లింగం, ఎస్ ఎఫ్ ఓ రాజేశ్వర్ రావు, ఈ ఈ సంతోష్ బాబు తహసీల్దార్ లు మహమ్మద్ ఇక్బాల్ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
Also Read: Jayshankar Bhupalpally: భూపాలపల్లిలో దొంగల హల్ చల్ 10 ఇళ్లలో చోరీ
